Begin typing your search above and press return to search.
రేవంత్ ఆప్తుడి ఇంట నకిలీ ఐటీ ఆఫీసర్ల సోదాలు
By: Tupaki Desk | 1 Oct 2018 1:25 PM GMTకాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఐటీ అధికారులు విచారణ పర్వం ఊహించని మలుపు తిరిగింది. ఓ వైపు రేవంత్ ఇంట సోదాలతో కలకలం చోటచేసుకోగా...తాజాగా ఆయన సన్నిహితుడు ఇంట్లోనూ అదే పర్వం జరిగింది. అయితే - ఈ ఎపిసోడ్ లో నకిలీ అధికారులు ఎంట్రీ ఇవ్వడం సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డి సన్నిహితుడు - ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ సింహ బంధువు ఇంట్లో నకిలీ అధికారులు సోదాలు నిర్వహించారని వార్త తెరమీదకు వచ్చింది.
పన్ను ఎగవేత - అవినీతి ఆరోపణలతో గత బుధవారం రేవంత్ రెడ్డితో పాటు ఆయన సన్నిహితుడు ఉదయ సింహా - ఎమ్మెల్సీ సెబాస్టియన్ - రేవంత్ రెడ్డి సోదరుడు కొండల రెడ్డి ఇళ్ళల్లో ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి విచారణకు హాజరు కావాలని ఐటీ అధికారులు సూచించారు. దీనితో సోమవారం ఆయన ఐటీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం అధికారులు ఆయన్ను విచారించారు. అనంతరం ఉదయసింహ మీడియాతో మాట్లాడుతూ ఐటీ అధికారుల విచారణకు మరింత సమయం కోరినట్లు తెలిపారు. మరోసారి విచారణకు హాజరు కావాలని అధికారులు సూచించానని - ఈనెల 3వ తేదీన మరోసారి విచారణకు రానున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తమ బంధువు నివాసంపై ఐటీ అధికారుల పేరిట దాడులు జరిగాయని - కానీ తాము దాడి చేయలేదని ఐటీ అధికారులు పేర్కొన్నారని తెలిపారు. తమ బంధువు ఇంటిపై దాడికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కాగా, ఓటుకు నోటు కేసులో కీలకమైన వ్యక్తి..ఏ2 ఉదయ్ సింహా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రూ. 50 లక్షలు ఎక్కడి నుండి వచ్చాయో తెలియచేయాలని ఐటీ అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.