Begin typing your search above and press return to search.

వ‌రాల‌కు రాజ‌ముద్ర వేసిన జ‌గ‌న్‌.. తొలి కేబినెట్ విశేషాలేమంటే?

By:  Tupaki Desk   |   10 Jun 2019 9:32 AM GMT
వ‌రాల‌కు రాజ‌ముద్ర వేసిన జ‌గ‌న్‌.. తొలి కేబినెట్ విశేషాలేమంటే?
X
అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే మ‌రోసారి త‌న‌దైన శైలిలో వ‌డివ‌డిగా నిర్ణ‌యాలు తీసుకున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఈ రోజు ఉద‌యం ఏపీ మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభ‌మైంది. ఈ భేటీలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. తాను ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ ప్ర‌మాణ‌స్వీకారం చేసిన నాటి నుంచి.. త‌ర్వాతి ద‌శ‌ల్లో ఇచ్చిన హామీలు.. తీసుకున్న నిర్ణయాల‌కు సంబంధించి రాజ‌ముద్ర‌ను వేశారు.

ఆశా వ‌ర్క‌ర్ల‌కు జీతాల్ని రూ.3వేల నుంచి రూ.10వేల వ‌ర‌కూ పెంచిన నిర్ణ‌యాన్ని మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం వేసింది. సామాజిక పెన్ష‌న్ల‌ను రూ.2250 చొప్పున పెంచుతూ తీసుకున్న నిర్ణ‌యానికి ఓకే చేసింది. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఐఆర్ చెల్లింపున‌కు ఆమోదం ప‌లికింది.

ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్ సానుకూలంగా స్పందించింది. దీనికి సంబంధించిన ప్ర‌క్రియ‌ను వెంట‌నే ప్రారంభించాల‌ని మంత్రివ‌ర్గ స‌మావేశం నిర్ణ‌యించింది. ఇక‌.. వైఎస్సార్ రైతుభ‌రోసా అమ‌లుపై చ‌ర్చ జ‌రిగింది. పారిశుద్ధ్య కార్మికులు.. హోంగార్డుల వేత‌నాల‌కు సంబంధించి ఏం చేయాల‌నే అంశంపై మంత్రివ‌ర్గంలో చ‌ర్చ న‌డుస్తోంది.