Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ మరోసారి విడాకులు ఇచ్చేశారు

By:  Tupaki Desk   |   30 Oct 2015 11:04 AM GMT
ఇమ్రాన్ మరోసారి విడాకులు ఇచ్చేశారు
X
ప్రముఖ పాక్ క్రికెటర్.. పాకిస్థాన్ తెహరిక్ ఏ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ మరోసారి వార్తల్లోకి వచ్చేశారు. తాజాగా ఆయన తన వ్యక్తిగత విషయానికి సంబంధించిన అంశంతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. పార్టీ పెట్టి పాక్ లో అధికారాన్ని సొంతం చేసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్న ఆయనకు అది సాధ్యం కావటం లేదు.

మరోవైపు ఆయన వ్యక్తిగత జీవితం తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. మొదట్లో బ్రిటన్ కు చెందిన జెమీమా ఖాన్ ను పెళ్లి చేసుకొని.. కొన్నాళ్లు కాపురం చేసిన తర్వాత 2004లో ఆమెకు తలాక్ చెప్పేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఒంటరిగా ఉన్నారు. కొన్నాళ్లకు బీబీసీలో యాంకర్ గా పని చేసిన రెహమ్ ఖాన్ తో ప్రేమాయణం సాగించిన ఆయన.. వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

రెహమ్ ఖాన్ కు గతంలోనే పెళ్లి అయి.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే.. పెళ్లి చేసుకున్న పది నెలలకే ఆమెకు విడాకులు ఇవ్వాలని ఇమ్రాన్ నిర్ణయం తీసుకున్నారు. తామిద్దరం పరస్పర అవగాహనతోనే విడాకులు తీసుకున్నట్లుగా ఇమ్రాన్ తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు. సో.. ఇమ్రాన్ మరోమారు ఒంటరివాడయ్యాడన్న మాట.