Begin typing your search above and press return to search.
ఇమ్రాన్ కు పవర్ భారత్ కు ఏం జరుగుతుంది?
By: Tupaki Desk | 26 July 2018 5:02 AM GMTపాకిస్థాన్ లో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ.. అధికారం చేపట్టే వారితో భారత్ పై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న వాదన జోరుగా సాగుతుంటుంది. ఈసారి అదే వాదన సాగుతోంది. క్రికెటర్ గా సుపరిచితుడైన ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. భారత్ కు తిప్పలేనన్న అభిప్రాయం మొదట్నించి ఉంది. భారత్ వ్యతిరేక ధోరణిని ప్రదర్శిస్తానన్న విషయాన్ని ఇమ్రాజ్ ఇప్పటికే తన తీరుతో స్పష్టం చేశాడు. దాయాదితో తాను సామరస్యంగా ఉండాలని ఇమ్రాన్ అస్సలు అనుకోవటం లేదు.
దీనికి తోడు సైన్యం దన్నుతో ఆయన గెలుపు ముడిపడి ఉండటంతో.. సైన్యం చేతిలో రిమోట్ అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల వేళలో ఇమ్రాన్ పై భారత్ అనుకూలుడన్న ఆరోపణల్ని నవాజ్ పార్టీ చేసింది. అయితే.. ఆయన దాన్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. నవాజ్ ను ఆధునిక మీర్ జాఫర్ తో పోలుస్తూ.. ఇస్లామిక్ సంప్రదాయాల కొనసాగింపే లక్ష్యంగా ఇమ్రాన్ పని చేసే వీలుందన్న మాట వినిపిస్తోంది. దేశ ప్రధాని కావాలన్న ప్రగాఢ వాంఛతో పార్టీ పెట్టిన ఇమ్రాన్.. తొలుత ఇస్లామిక్ తీవ్రవాదానికి.. అవినీతికి వ్యతిరేకంగా గొంతు విప్పారు. అలా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం.. ఆయన ఎదుర్కొన్న తొలుత ఎన్నికల్లో ఇమ్రాన్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు. 2013లో ఎదురైన ఓటమి ఆయన్ను చాలా మార్చిందని చెబుతారు. తర్వాతి రోజుల్లో మత చాందసవాదిగా మారటమేకాదు.. అధికారాన్ని చేపట్టేందుకు వీలుగా పాక్ సైన్యానికి దగ్గరయ్యారు. పాక్ లోని ఉగ్రవాద సంస్థ అయిన హర్కతుల్ మొజాహిదీన్ అధినేత మౌలానా ఫజులుర్ రెహమాన్ లాంటి వివాదాస్పద నేతలు సైతం ఇమ్రాన్ కు తమ మద్దతును ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ గెలుపు భారత్ కు ఇబ్బందేనని.. దాయాదికి వ్యతిరేక వైఖరిని స్పష్టంగా ప్రదర్శించే వీలుందన్న మాట బలంగా వినిపిస్తోంది.