Begin typing your search above and press return to search.
బుద్ది తక్కువగా మాట్లాడాను.. అంటూ చెంపలేసుకున్న ఇమ్రాన్ ఖాన్
By: Tupaki Desk | 29 July 2021 3:48 AM GMTఅత్యున్నత స్థానాల్లో ఉన్న వారు మిగిలిన వారు మాట్లాడినంత సింఫుల్ గా మాట్లాడేయకూడదు. తాను చేసే ప్రతి వ్యాఖ్య కోట్లాదిమందిని ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే వచ్చే తిప్పలు అన్ని ఇన్ని కావు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తరచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ ఉంటారు. ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో మహిళలపై జరిగే అత్యాచారాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పెను సంచలనానికి తెర తీయటంతో పాటు.. ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు ఆయన కామెంట్లకు తిట్టి పోశారు కూడా.
ఇదిలా ఉంటే తాజాగా అమెరికన్ మీడియా సంస్థకు ఆయనో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తాను గతంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. అత్యాచారాలపై గతంలో తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నట్లుగా కనిపించారు. తాను చేసిన వ్యాఖ్యలు తప్పన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. అత్యాచారానికి పాల్పడే వ్యక్తే పూర్తిగా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మహిళలు ఆకర్షించే.. రెచ్చగొట్టే ధోరణులతోనే అత్యాచారాలు జరుగుతున్నాయని మాట జారటం.. దానిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం కావటం తెలిసిందే. అత్యాచారాలకు మహిళల వస్త్రధారణ కూడా కారణమన్నట్లుగా చేసిన ఆయన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. పలువురుఆయన మాటల్ని తీవ్రంగా ఖండించారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసింది. ఈ విషయాన్ని ఇమ్రాన్ గుర్తించినట్లుగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో తన తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు.
అత్యాచారానికి పాల్పడే వ్యక్తే పూర్తిగా అందుకు బాధ్యత వహించాలని.. స్త్రీ ఎంత రెచ్చగొట్టినా.. ఎలాంటి దుస్తులు ధరించినా.. చివరకు ఆమే బాధితురాలు అవుతుంది కాబట్టి బాధితురాలు ఎప్పుడూ బాధ్యురాలు కాదన్నారు. ‘ఇక ముందెప్పుడూ కూడా బుద్ధి తక్కువ వ్యాఖ్యలు చేయను. గత ఇంటర్వ్యూలో ఏం మాట్లాడింది బాగా గుర్తుంది. ఎప్పుడూ అత్యాచారానికి పాల్పడే వ్యక్తే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నా. ఇస్లాం మహిళలకు గౌరవం ఇస్తుంది’ అని డ్యామేజ్ కంట్రోల్ మాటలు మాట్లాడారు.
అయితే..గతంలో ఇమ్రాన్ మాటలతో ఆయనకు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెబుతున్నారు. ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగానే ఉంటుందని చెబుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం పాక్ లో రోజూ యావరేజ్ గా పదకొండు రేప్ కేసులు నమోదవుతున్నాయి. ఒక నివేదిక ప్రకారం ప్రపంచంలో లింగ సమానత్వం (జండర్ ఈక్వాలిటీ) అతి తక్కువగా ఉన్న దేశాల జాబితాలో పాకిస్థాన్ ఏడాది వ్యవధిలో రెండు ర్యాంకులు దిగజారినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో అట్టుడగున ఉన్న నాలుగు దేశాల్లో పాకిస్థాన్ ఒకటని చెప్పక తప్పదు.