Begin typing your search above and press return to search.
ఆ పాక్ మాజీ క్రికెటర్ రేపులు చేయడంలో దిట్ట
By: Tupaki Desk | 21 Feb 2018 5:36 AM GMTపాక్ క్రికెట్ దిగ్గజం తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ (65) మూడో వివాహం చేసుకున్నాడు.అయితే ఇమ్రాన్ మూడు పెళ్లి పై ఆయన రెండో మాజీ భార్య రేహమ్ ఖాన్ నిప్పులు చెరిగారు. ఇమ్రాన్ పచ్చిమోసగాడు.. రేపులు చేయడంలో దిట్ట అంటూ మండిపడింది.
1992లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై పాకిస్తాన్ విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించిన ఇమ్రాన్ ఖాన్ కొద్దికాలానికి క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 1995లో బ్రిటన్ కు చెందిన ఎంపీ - బిలీనియర్ సర్ జేమ్స్ గోల్డ్ స్మిత్ కుమార్తె జెమీమా గోల్డ్ స్మిత్ ను వివాహమాడారు. తొమ్మిదేళ్ల పాటు కొనసాగిన దాంపత్య జీవితానికి పుల్ స్టాప్ పెట్టిన ఇమ్రాన్ ఆమెతో విడిపోయాడు. వీరికి ఇద్దరు అబ్బాయిలు.
ఇక బీబీసీ జర్నలిస్ట్ గా పనిచేస్తున్న రేహమ్ ఖాన్ ను 2015లో మనువాడినా కొద్దికాలానికి ఆమెతో బంధాన్ని తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తన ఆధ్యాత్మిక సలహారుగా ఉన్న బుష్రామేనకాను ఇమ్రాన్ పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని కొట్టిపారేసే ప్రయత్నం చేసినా బుష్రాతో తన బంధాన్ని కొనసాగించాడు. ఇటు తెహ్రీక్ - ఎ- ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడిగా ఉండడంతో ఇమ్రాన్ - బుష్రాల బంధంపై ఆయన ప్రత్యర్ధులు విమర్శనాస్త్రాలు సంధించారు.
దీంతో సొంత పార్టీనేతలు పట్టుబట్టి వివాహం గురించి బహిరంగంగా ప్రకటించాలని కోరారు. అయితే వారి కోరిక మేరకు బుష్రాను మనేకాను వివాహం చేసుకున్నట్లు ఇమ్రాన్ తన పార్టీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
ఇదిలా ఉంటే ఇమ్రాన్ పెళ్లిపై ఆయన రెండో భార్య రేహమ్ ఖాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇమ్రాన్ పచ్చిమోసగాడని, వివాహేతర సంబంధాల్లో ఆరితేరాడని ఆరోపించింది. తనని వివాహం చేసుకున్నప్పుడే ఇమ్రాన్ కు - బుష్రాతో వివాహేతర సంబంధం ఉన్న విషయం తనకు తెలుసని చెప్పుకొచ్చింది. అందుకే పెళ్లి జరిగిన కొద్దికాలానికి అతనికి విడాకులు ఇచ్చినట్లు తెలిపింది.
తామిద్దరం వివాహం చేసుకున్న రెండు నెలల తర్వాత ఆ ఫొటోలు - ప్రకటనను మీడియాకు ఇచ్చారని, అలాగే, ఇపుడు ఇమ్రాన్ మూడో పెళ్లి నెల క్రితమే జరిగిందనీ ఆమె వ్యాఖ్యానించింది. ఇమ్రాన్ ఖాన్ లాంటి నీతిమాలిన వ్యక్తిని తన జీవితంలో ఇంతవరకు చూడలేదని రేహమ్ ఖాన్ పేర్కొంది.