Begin typing your search above and press return to search.
ఇమ్రాన్ సర్కార్ ఎక్స్ పైరీ డేట్ దగ్గరకు వచ్చేసిందా?
By: Tupaki Desk | 16 Dec 2020 10:05 AM GMTమన దేశంలో మాదిరి కాదు దాయాది పాకిస్తాన్ లో ఏ నిమిషాన ఆర్మీ ప్రజా ప్రభుత్వం మీద అధిక్యతను సాధిస్తుందో చెప్పలేం. రాత్రికి రాత్రి సైన్యం తిరుగుబాటు జెండా ఎగురవేయటం.. అధికారంలో ఉన్న వారిని జైలుపాలు చేయటం అక్కడేం కొత్తకాదు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల అభిమానం ఉన్నంతవరకు ఓకే.. కాస్త లెక్క తేడా వచ్చినా.. ఆర్మీ కీ రోల్ ప్లే చేయటానికి సిద్ధమవుతుంటుంది. ఆ లెక్కన చూస్తే.. తాజాగా అధికారంలో ఉన్న ఇమ్రాన్ సర్కారుకు కొత్త తిప్పలు మొదలైనట్లే.
తాజాగా వెల్లడైన సర్వే ఫలితం ఇదే విషయాన్ని చెబుతోంది. ఇమ్రాన్ ప్రభుత్వం గాడి తప్పి.. తప్పుదారిలో పయనిస్తోందన్న మాట 77 శాతం మంది పాక్ ప్రజల నోట వినిపిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఐపీఎస్ఓఎస్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇమ్రాన్ ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని వారు చెప్పేశారు. డిసెంబరు ఒకటి నుంచి ఆరు మధ్యలో నిర్వహించిన సర్వేలో కొత్త విషయాలు బయటకు వచ్చాయి.
శాంపిల్ సైజ్ చిన్నదే కావొచ్చు కానీ.. ఫలితాలు మాత్రం తేడా కొట్టేలా ఉన్నాయి.వెయ్యి మందికి పైగా సేకరించిన అభిప్రాయాల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని 36 శాతం మంది అభిప్రాయపడితే.. 13 శాతం మంది బాగున్నట్లు చెప్పారు. ఇక.. 51 శాతం మందైతే.. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని పేర్కొన్నారు. తాజా సర్వే ఫలితాన్ని చూస్తే.. దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి పేలవంగా ఉన్నట్లుగా తేల్చారు. నిరుద్యోగం పెద్ద సమస్యగా ఉందన్న మాట వచ్చింది. ఆర్థిక పరిస్థితి 25 శాతం బాగా లేదని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం మీద ఆగ్రహం పెరుగుతుందన్న విషయం మీద స్పష్టత వచ్చే కొద్దీ.. ఇమ్రాన్ ప్రభుత్వానికి కొత్త తిప్పలు షురూ అయినట్లే. ప్రభుత్వానికి ఎక్స్ పైరీ డేట్ దగ్గర పడినట్లే.