Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ కు 5గురు అక్ర‌మ సంతానం..రేహమ్!

By:  Tupaki Desk   |   13 July 2018 8:25 AM GMT
ఇమ్రాన్ కు 5గురు అక్ర‌మ సంతానం..రేహమ్!
X
పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ - తెహ్రికె ఇన్సాఫ్‌ అధినేత ఇమ్రాన్‌ ఖాన్ పై ఆయన మాజీ భార్య రేహమ్‌ ఖాన్ కొద్ది రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇమ్రాన్ గే అని - ఆయ‌న త‌న పార్టీకి చెందిన ఓ వ్యక్తితో స్వ‌లింగ సంప‌ర్కం చేశార‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా, ఇమ్రాన్ స‌న్నిహితుడు...పాక్ క్రికెట‌ర్ వ‌సీమ్ మాజీ భార్య‌కు న‌ల్ల‌జాతి వ్య‌క్తితో సంబంధం ఉంద‌ని ఆరోపించారు. తాజాగా, ఇమ్రాన్ పై రేహ‌మ్ మ‌రిన్ని సంచ‌లన ఆరోప‌ణ‌లు చేశారు. ఇమ్రాన్ డ్రగ్స్‌ తీసుకుంటాడని, చేతబడులు వంటి వాటిని నమ్ముతాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా, ఇమ్రాన్ కు 5గురు అక్రమ సంతానం ఉన్నారని, అందులో భారత్ కు చెందిన వారు కూడా ఉన్నార‌ని సంచ‌లన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్‌ ఖాన్ పై రేహమ్‌ ఖాన్‌ రచించిన పుస్తకం గురువారం విడుదలయిన నేప‌థ్యంలో ఈ వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

ఆ పుస్తకంలో రేహమ్.... త‌మ‌ వైవాహిక జీవితానికి సంబంధించిన విష‌యాల‌తోపాటు ఇమ్రాన్‌ ఖాన్‌ రాజకీయ - వ్యక్తిగత అంశాలను కూడా ప్ర‌స్తావించారు. ఇమ్రాన్ కు ప్ర‌ధాని కావాల‌ని ఆశ ఉంద‌ని, మోదీ ఆయ‌న‌కు స్ఫూర్తి అని చెప్పారు. ఇమ్రాన్ కు చాలా మంది మ‌హిళ‌ల‌తో అక్రమ సంబంధం ఉంద‌ని - వారికి 5గురు అక్ర‌మ సంతానం కూడా ఉన్నారని ఆ పుస్త‌కంలో తెలిపారు. ఆ అక్ర‌మ సంతానంలో భారత్ కు చెందిన వారు కూడా ఉన్నారని తెలిపారు. త‌న‌తోపాటు ఇమ్రాన్ మొద‌టి భార్య జెమీమా గోల్డ్‌ స్మిత్ కు మాత్రమే ఈ అక్రమ సంతానం గురించి తెలుసని రేహమ్ తెలిపారు. త‌న‌కు పిల్లలు లేర‌ని, అందుకే వారితో సంతానం పొందినట్లు ఇమ్రాన్ తాను అక్రమ సంబంధం పెట్టుకున్న మ‌హిళ‌ల‌కు చెప్పేవారని రేహమ్ వెల్లడించింది. త్వ‌ర‌లో జ‌ర‌గనున్న పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ పుస్తకం విడుదల కావడంతో ఇమ్రాన్‌ ఖాన్ మరిన్ని చిక్కుల్లో పడ్డ‌ట్ల‌యింది.