Begin typing your search above and press return to search.
యుద్ధం తర్వాత.. మీ గడ్డ మీద బ్యానర్లు చూడండి ఇమ్రాన్
By: Tupaki Desk | 7 Aug 2019 12:14 PM GMTజమ్ముకశ్మీర్ విషయంలో ప్రధాని మోడీ చేపట్టిన ఆపరేషన్ పూర్తి కావటం.. ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేసిన వైనంతో పుట్టుకొచ్చిన ప్రకంపనలు సద్దుమణగక ముందే.. కలలో కూడా ఊహించని కొత్త డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. పాకిస్థాన్ గడ్డ మీదా.. అందునా రాజధాని నగరంలో తాజాగా దర్శనమిచ్చిన బ్యానర్ల గురించి తెలిస్తే షాక్ తినాల్సిందే. ఇలాంటి బ్యానర్లు పాక్ గడ్డ మీద వెలవటం చూస్తే.. భారత్ లోనే కాదు పాక్ లోనూ మోడీ అభిమానులు అంతకంతకూ పెరుగుతున్నారని చెప్పాలి.
సంఘ్ పరివార్ కు చెందిన వారు తరచూ అఖండ్ భారత్ కలను చెబుతుంటారు. చేతిలో ఉన్న కశ్మీరాన్ని కోల్పోయి కూడా..అఖండ్ భారత్ కల కంటావా పిచ్చ ఎదవా? అంటూ తిట్టే వారంతా.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు దేశానికి కావాల్సిన అసలుసిసలు నేత పుట్టుకొచ్చినట్లుగా ఫీలైపోతున్న పరిస్థితి.
నిజానికి మోడీ నిర్ణయాలతో ఆయన సొంత పార్టీ కంటే.. విపక్ష పార్టీలో ఆయన్ను అభిమానించి.. ఆరాధించే నేతలు అంతకంతకూ ఎక్కువైపోతున్నారా? అన్న భావన కలగటం ఖాయం. దీనికి నిదర్శనంగా ఒకప్పటి తెలుగు హీరోయిన్.. తాజాగా ఎంపీ అయిన నవనీత్ కౌర్ నిన్న (మంగళవారం) లోక్ సభలో చేసిన ప్రసంగాన్ని చెప్పొచ్చు.
ఇంతకీ పాక్ రాజధాని నగరంలో దర్శనమిచ్చిన బ్యానర్ ఏమంటే.. భారత్ కు మద్దతుగా పలు చోట్ల ఈ బ్యానర్లు వెలిశాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ బ్యానర్లలో అఖండ భారత్ లక్ష్యాన్ని సైతం మోడీ పూర్తి చేయాలంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యల్ని ఆ బ్యానర్లలో హైలెట్ చేసిన వైనం అక్కడ కలకలాన్ని రేపుతోంది.
ఓపక్క కశ్మీర్ కు సంబంధించి మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో యుద్ధమే అంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటులో రంకెలు వేస్తుంటే.. మరోవైపు దేశ రాజధాని నగరంలో అఖండ భారత్ పేరుతో బ్యానర్లు వెలవటం విశేషంగా మారింది. అఖండ భారత్ అంటే ఏమిటంటారా? కొన్ని వందల ఏళ్ల క్రితం పాక్.. ఆఫ్ఘానిస్థాన్.. బంగ్లాదేశ్ తో కూడిన ప్రాంతాన్ని అఖండ భారత్ గా పేర్కొంటారు. మాటే కాదు సుమా.. దానికి సంబంధించిన మ్యాప్ ను కూడా బ్యానర్లలో ప్రదర్శించటం విశేషం.
ఇస్లామాబాద్ లోని ప్రెస్ క్లబ్ తో పాటు సెక్టార్ ఎఫ్-6.. అబ్ పారా చౌక్ ప్రాంతంలో ఈ అఖండ భారత్ బ్యానర్లు దర్శనమివ్వటంతో పాక్ అధికార పక్షానికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. భారత్ మీద యుద్ధం చేయాలని ఊవ్విళ్లూరుతున్న ఇమ్రాన్.. ముందు తన రాజధాని నగరంలోని బ్యానర్లను చూసైనా తన మైండ్ సెట్ ను కాస్త సెట్ చేసుకుంటే మంచిదేమో?
ఇక.. బ్యానర్లలో ని విషయాన్ని గుర్తించిన కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు హుటాహుటిన అక్కడకు చేరుకొని వాటిని తొలగించారు. ఈ ఘటనకు సంబంధం ఉందని భావిస్తున్న ఒక అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ బ్యానర్ల వ్యవహారాన్ని పాక్ ప్రముఖ దినపత్రిక డాన్ సైతం ప్రచురించింది.