Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ ప్ర‌మాణ స్వీకారం..మోడీకి ఆహ్వానం?

By:  Tupaki Desk   |   31 July 2018 5:12 PM GMT
ఇమ్రాన్ ప్ర‌మాణ స్వీకారం..మోడీకి ఆహ్వానం?
X
తాజాగా జ‌రిగిన పాక్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పాక్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ - పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆగస్టు 11న పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ప్రమాణం స్వీకారం చేయబోతున్న విష‌యం విదిత‌మే. తాజాగా, ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి భార‌త ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం అందింది. మోదీతోపాటు `సార్క్`(ఆఫ్ఘనిస్థాన్ - నేపాల్ - భూటాన్ - భారత్ - బంగ్లాదేశ్ - మాల్దీవులు - శ్రీలంక) దేశాధినేతలను ఆహ్వానించాలని ఇమ్రాన్ భావిస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే, ఈ విష‌యంపై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది. మోదీ - ఇమ్రాన్ ల మ‌ధ్య విభేదాలున్నాయ‌ని టాక్ వ‌స్తోన్న స‌మ‌యంలో....మోదీని ఇమ్రాన్ ఆహ్వానించ‌బోతున్నార‌న్న వార్త ఇరు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

పాక్ అధ్య‌క్షుడు ఇమ్రాన్ ఖాన్ కు నరేంద్ర మోడీ ఫోన్ చేసి అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మ‌ధ్య శాంతి స్థాప‌న‌కు - ద్వైపాక్షిక బంధంలో న‌వ శ‌కాన్ని ఆరంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని మోడీ అన్నారు. అయితే, ఇమ్రాన్ కు పాక్ ఆర్మీ పూర్తి మ‌ద్ద‌తునిస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే, దానితో పాటు ఐఎస్ ఐ - కొన్ని ఉగ్ర‌వాద సంస్థలు కూడా ...ఇమ్రాన్ కు మ‌ద్ద‌తిచ్చాయ‌ని పుకార్లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఉగ్ర‌వాదంపై ఉక్కుపాదం మోపేందుకు మోడీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ వంటి సంచ‌ల‌న నిర్ణయాలు తీసుకొని పాక్ ఆర్మీ కంటిమీద కునుకు లేకుండా చేశారు. అందులోనూ, పాక్ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ కు మోడీకి సాన్నిహిత్యం ఉంది. 2014లో మోడీ ప్రమాణస్వీకార కార్య‌క్ర‌మానికి షరీఫ్‌ హాజరయ్యారు.

అయితే, ఆ వేడుకకు హాజ‌రు కావ‌ద్ద‌ని పాక్ అర్మీ ...చెప్పినా విన‌కుండా ష‌రీఫ్ వ‌చ్చారు. ఆ తర్వాత 2015 డిసెంబరులో నవాజ్‌ షరీఫ్‌ పుట్టినరోజు సందర్భంగా విదేశీ పర్యటనలో ఉన్న మోడీ ....లాహోర్ లో హ‌ఠాత్తుగా ప్ర‌త్య‌క్ష‌మై షరీఫ్‌ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.అయితే, ఇమ్రాన్- మోడీ జోడీ ఇరు దేశాల మ‌ధ్య శాంతిని నెల‌కొల్పేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఈ ఆహ్వానం వార్త‌...హాట్ టాపిక్ అయింది. అయిన‌ప్ప‌టికీ...భార‌త్ ను దెబ్బ తీసేందుకు గోతికాడ న‌క్క‌లా కాచుకొని ఉండే పాక్ ఆర్మీతో అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని గ‌త అనుభ‌వాలు చెబుతున్నాయి. మ‌రి, ఆ కార్య‌క్ర‌మానికి మోడీని అధికారిక ఆహ్వానం అందుతుందా...ఆయ‌న‌ హాజ‌ర‌వుతారా లేదా అన్న‌ది వేచి చూడాలి.