Begin typing your search above and press return to search.
బిల్ గేట్స్ తో ఇమ్రాన్ భేటీ.. భారీ రహస్యం బయటకొచ్చింది
By: Tupaki Desk | 20 Feb 2022 4:35 AM GMTగడిచిన రెండురోజులుగా పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జబ్బలు చరుచుకుంటున్నారు. ప్రపంచ సంపన్నుల్లో ఒకరు.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తొలిసారి పాకిస్థాన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం ఒక విందును ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. దీనికి సంబంధించిన ఒక ఫోటోను విడుదల చేశారు.
అందులో కూడా తప్పేం లేదు. కానీ.. విడుదల చేసిన ఫోటోలో దొర్లిన లోపం.. ఒక నిజాన్ని దాచాలన్న ఇమ్రాన్ సర్కారు ప్రయత్నం ఫెయిల్ కావటమే కాదు.. అతగాడి తీరు అడ్డంగా దొరికిపోయేలా చేసింది.
ఈ విందుకు ఇమ్రాన్ మంత్రివర్గంలోని మంత్రులతో పాటు.. పలువురుహాజరయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ విందుకు సంబంధించి ప్రధాని ఇమ్రాన్ ఒక ఫోటోను విడుదల చేశారు.
ఆ ఫోటోలోఒక వ్యక్తి అస్పష్టంగా కనిపించటం.. దీంతో అనుమానంతో మరింత నిశితంగా చూస్తే.. అందులో ఒక వ్యక్తిని కనిపించకుండా మార్ప్ చేసిన వైనం బయటకు వచ్చింది. ఇంతకూ ఆ వ్యక్తి ఎవరో కాదు ఐఎస్ఐ చీఫ్ లెప్టినెంట్ నదీమ్ అంజున్ గా గుర్తించారు.
ఫిబ్రవరి 17న ఇమ్రాన్ విడుదల చేసిన ఫోటోలో.. మార్ఫ్ చేసిన వైనాన్ని గుర్తించిన నెటిజన్లు ప్రశ్నించటం మొదలు పెట్టారు. పాకిస్థాన్ లో ఐఎస్ఐ చీఫ్ కు ఉండే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
ఒక అత్యుత్తమ సమావేశానికి ఐఎస్ఐ చీఫ్ ను ఆహ్వానించటం చూస్తే.. అతగాడికి ఉన్న స్థాయి ఏమిటో అర్థమవుతుందని చెబుతున్నారు. ఎవరెన్ని చెప్పినా పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం మొత్తం సైన్యం.. ఐఎస్ఐ చీఫ్ చేతుల్లో ఉంటుందన్నది బహిరంగ రహస్యం.
ఈ విందు భేటీలో తన ఫోటో తీయొద్దని.. వీడియోలో తనను కవర్ చేయొద్దని కోరారట. అయితే.. అనూహ్యంగా మార్ప్ చేసిన వైనం బయటకు రావటంతో పాక్ ప్రభుత్వంలో ఐఎస్ఐ చీఫ్ కు ఇచ్చే ప్రాధాన్యత ఎంతన్నది ఇట్టే అర్థమయ్యే పరిస్థితి. రహస్యంగా దాచాలనుకున్న విషయం మార్ఫ్ చేసిన వైనంలో దొర్లిన పొరపాటుతో సదరు గుట్టు కాస్తా రట్టైంది.