Begin typing your search above and press return to search.
ఇండియాలో మోడీనే గెలవాలన్న ఇమ్రాన్ ఖాన్!
By: Tupaki Desk | 10 April 2019 5:38 AM GMTభారత ప్రధానిగా మళ్లీ మోడీ ఎన్నిక కావడమే మేలని అన్నారు..పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్! ఒకవైపు ఇండియా లోక్ సభ తొలి విడత ఎన్నికల పోలింగ్ కు సమయం ఆసన్నం అవుతున్న వేళ పాక్ ప్రధాని వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. ఇండియాలో మళ్లీ మోడీ పాలనే రావాలని ఈ మాజీ క్రికెటర్ ఆకాంక్షించారు.
అందుకు ప్రత్యేక కారణం ఏమిటి? అంటే… ఒకవేళ మోడీ మళ్లీ ప్రధానమంత్రి అయితే, కశ్మీర్ ఇష్యూ మీద సెటిల్ మెంట్ జరుగుతుందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. అదే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని పార్టీలు అధికారంలోకి వస్తే.. కశ్మీర్ వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటుందని, ఏ నిర్ణయం తీసుకోవడానికి కూడా కాంగ్రెస్ వాళ్లు ధైర్యం చేయరు.. అని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.
ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం.. రైట్ వింగ్ కు భయపడుతుందని అభిప్రాయపడ్డారు. అంటే బీజేపీ ప్రతిపక్షంలో ఉంటే.. కాంగ్రెస్ పార్టీ చేతిలో అధికారం ఉన్నా కశ్మీర్ వంటి కీలకమైన అంశాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోలేదని ఇమ్రాన్ ఖాన్ చెబుతున్నారు.
అదే మోడీ అయితే.. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలరనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాడు ఇమ్రాన్ ఖాన్. ఇండియాలో ముస్లింలు గతం నుంచి సురక్షితంగానే ఫీలయ్యే వారని, అయితే హిందూ అతివాదం వల్ల ఇండియాలోని ముస్లింలలో కొంత భయం నెలకొని ఉందని మాత్రం ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.
మొత్తానికి మళ్లీ మోడీనే భారత్ కు ప్రధాని కావాలని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించడం విశేషమే. నాయకుడిగా ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోలగలరని మోడీకి ఇమ్రాన్ ఖాన్ కితాబిచ్చినట్టే!