Begin typing your search above and press return to search.
ఇండియన్స్ ని చూసి బుద్ది తెచ్చుకోండి .. ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు !
By: Tupaki Desk | 14 Dec 2019 10:48 AM GMTఇండియా, పాకిస్థాన్ ..దేశాలు పక్క పక్కనే ఉన్నప్పటికీ ఒకరికంటే ఒకరికి అసలు పడదు. ఈ విషయం అందరికి తెలిసిందే. ముఖ్యంగా పాకిస్థాన్ ..వీలుచిక్కినప్పుడల్లా ఇండియా పై కయ్యానికి కాలుదువ్వుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటుంది. ఇది కూడా మాములే. కానీ , తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ..భారత్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇది ప్రపంచంలో ఎనిమిదో వింత క్రింద లెక్కపెట్టవచ్చు . గతంలో ఏనాడూ ఇండియా పట్ల ఆయన ఇంత పాజిటివ్ గా స్పందించలేదు, ఇప్పుడు అయన స్పందించిన తీరు ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు.
విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులను , అలాగే ఫారిన్ లో సెటిలైన చైనీయులను చూసి విదేశాల్లో ఉంటున్న పాకిస్తానీయులు నేర్చుకోవలసింది ఎంతో ఉందని, వారు తమ మాతృదేశాల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నారని, అవినీతి రహిత వ్యవస్థతో తమ దేశాల ఎకానమీలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఇటీవల తమ దేశం 'అవినీతి రహిత దినోత్సవం' సందర్భంగా మాట్లాడిన ఆయన.. పాకిస్తాన్ గతంలో ఎన్నడూ లేనంతగా అవినీతిని ఎదుర్కొంటోందని, కానీ విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీయులు మాత్రం విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తున్నారని తెలిపాడు.
తమ మాతృ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వారు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో తెలియడంలేదన్నారు. అలాగే చైనీయులు కూడా తమ దేశ అభివృధ్ది కోసం భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారని ఆయన అన్నారు. విదేశాలలో ఉన్నవారు మనకు పెద్ద ఎసెట్.. నేను సదా మీకు సన్నిహితంగానే ఉంటున్నాను. కానీ పెట్టుబడులు పెట్టేందుకు మీరు ఎందుకు సందేహిస్తున్నారు.. ఎందుకు విముఖత చూపుతున్నారు ? ఇక్కడ అవినీతి, లంచగొండులు పెరిగిన కారణంగానేనా ? అని ఇమ్రాన్ వారిని ప్రశ్నించారు.
ఇకపోతే ఇండియన్ ఎకానమీ వృద్దిలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో ఉంది. వరల్డ్ లో భారత పెట్టుబడులు అత్యధికమని ప్రపంచ బ్యాంకు గుర్తించింది. గత ఏడాది ఇది దాదాపు 78 బిలియన్ డాలర్ల మేర ఉంది.. ఆ తరువాత చైనా, మెక్సికో 67, 36 బిలియన్ డాలర్లతో రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి.