Begin typing your search above and press return to search.
భారత్ మీద విషం కక్కిన ఇమ్రాన్.. స్పీచ్ లో ఏం చెప్పారంటే?
By: Tupaki Desk | 28 Sep 2019 5:20 AM GMTచేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి ఏం చేయాలి? గొంతు పెంచాలి. ఉద్రేకాన్ని ఆయుధంలా మార్చాలి. వీలైనన్ని నిందలు వేయాలి. తమ తప్పేం లేదన్న వాదనను వినిపించాలి. మొత్తంగా తాము సుద్దపూసలమని.. తమను లక్ష్యంగా చేసుకున్నారంటూ ఆడిపోసుకోవాలి. సరిగ్గా.. ఇలాంటి తీరునే ప్రదర్శించారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. తాము ఎంతగా స్నేహ హస్తాన్ని చాచినా.. భారత్ స్పందించటం లేదని.. తమ శాంతి ప్రయత్నాల్ని నిర్వీర్యం చేసేలా.. తమ దేశాన్ని వేధింపులకు గురి చేసేలా భారత ప్రధాని మోడీ తీరు ఉందన్నట్లుగా ఆయన దారుణ వ్యాఖ్యలు చేశారు. అన్ని మతాల్లో తీవ్రవాద చర్యలకు పాల్పడే వ్యక్తులు ఉంటారని చెప్పిన ఇమ్రాన్.. ముస్లింలను బూచిగా చూపించే ధోరణిని ప్రాశ్చాత్య దేశాలు చూపిస్తున్నాయంటూ నిందలు వేసే కార్యక్రమాన్ని మరింత విస్తరించే ప్రయత్నం చేశారు.
ప్రపంచంలో మెజార్టీ ఆత్మాహుతి దాడులకు పాల్పడింది తమిళ టైగర్లేనని.. వారంతా హిందువులేనని.. కానీ ఎవరూ హిందువుల మీద ఆరోపణలు చేయరంటూ ఒక మాత నాయకుడికి ఏ మాత్రం తగ్గని రీతిలో ప్రపంచ వేదిక మీద ఇమ్రాన్ మాట్లాడారు. ఆయన ప్రసంగంలోని కీలక అంశాల్ని చూస్తే..
+ ఇస్లాం ఒక్కటే ఉంది. రాడికల్ ఇస్లామంటూ ఏదీ లేదు. ఏ మతమూ తీవ్రవాదాన్ని బోధించదు. అన్నిమతాల్లోనూ తీవ్రవాద చర్యలకు పాల్పడే వ్యక్తులు ఉంటారు. అన్ని మతాలకూ ఆధారం.. దయ - న్యాయం. అవే మనల్ని జంతువుల నుంచి వేరుగా ఉంచుతాయి.
+ రాడికల్ ఇస్లాం అనే పదం ఏం సందేశం పంపుతుంది? న్యూయార్క్ లాంటి చోట ఒక వ్యక్తి.. మితవాద ముస్లిం - రాడికల్ ముస్లిం మధ్య తేడాను ఎలా గుర్తించగలడు? 9/11 కు ముందు ప్రపంచంలో మెజారిటీ ఆత్మాహుతి దాడులు జరిపింది తమిళ టైగర్లే.. అంటే హిందువులే. కానీ.. హిందూయిజంపై ఎవరూ ఆరోపణలు చేయలేదు. అది సరైనదే. అన్నింటికీ తెగించిన కొందరు శ్రీలంకలో ఏదో చేస్తే.. హిందూయిజంతో సంబంధం ఏముంటుంది?
+ 20 ఏళ్ల కశ్మీరీ యువకుడు భారత సైనిక కాన్వాయ్ వెళ్తుండగా తనను తాను పేల్చేసుకున్నాడు. దానికి భారత్ మమ్మల్ని నిందిస్తోంది. ఏ చిన్న ఆధారం ఉన్నా మాకు పంపండి అని మేం మోడీకి చెప్పాం. దానికి ప్రతిగా మాపై బాంబులు వేశారు. మేం తిప్పికొట్టాం.
+ ఎన్నికల వేళ మోదీ ప్రచారమంతా మా పది చెట్లను కూల్చేయడం పైనే జరిగింది. పైగా దానికి ఆయన ‘ఇది ఉత్త ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది’ లాంటి మాటలు మాట్లాడారు. దీంతో మేం అదంతా ఎన్నికల ప్రచారం కోసమే అనుకున్నాం.
+ ఎన్నికలైన తర్వాత భారత్ ను సంప్రదించినప్పుడు తెలిసింది.. వారు మమ్మల్ని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ బ్లాక్‌లిస్ట్ జాబితాలో చేర్చాలనుకుంటున్నారని. ఆ తర్వాత వారి ఎజెండాలో అసలు విషయం ఆగస్టు 5న బయటికొచ్చింది.
+ ఆ రోజున వారన్నిచట్టాల్ని ఉల్లంఘిస్తూ 1,80,000 మంది అదనపు సైన్యాన్ని జమ్మూకశ్మీర్‌కు తరలించారు. ఇప్పుడు అక్కడ 9 లక్షల మంది సైనికులున్నారు. వారు 80 లక్షల మంది కశ్మీరీ ప్రజలను కర్ఫ్యూ నిర్బంధంలో ఉంచారు.
+ నేనీ సమావేశానికి రావటానికి ముఖ్య కారణం కశ్మీర్ అంశం. అక్కడ విధించిన అమానవీయ కర్ఫ్యూను భారత్ ఎత్తి వేయాలి. కశ్మీర్ లో తీవ్ర నిర్బంధంలో ఉన్న 80 లక్షల మంది భారత్ అణిచివేతతో తీవ్రవాదం వైపుమళ్లే ప్రమాదం ఉంది.
+ దీనిపై అంతర్జాతీయ సమాజం ఏం చేయబోతోందో చెప్పాలి. 120 కోట్ల మంది ప్రజలున్న మార్కెట్‌ను బుజ్జగిస్తారా? లేక న్యాయం కోసం మానవత్వం కోసం నిలబడతారా? నాకు భారత్‌లో స్నేహితులున్నారు. ఇండియాకు వెళ్లడమంటే నాకు చాలా ఇష్టం. అందుకే మేం అధికారంలోకి రాగానే భారత్ కు స్నేహహస్తం చాచాం. వాణిజ్యం ద్వారా విభేదాలను పరిష్కరించుకుందామని కోరాం. కానీ.. పాకిస్థాన్ నుంచి ఉగ్రదాడులు జరుగుతున్నాయని మోదీ అన్నారు. అప్పుడు మేం.. బెలూచిస్థాన్ లో మీ వైపు నుంచి దాడులు జరిగాయని చెప్పాం.
+ నేనిప్పుడు ఆరెస్సెస్ గురించి చెబుతాను. ఈ సంస్థకు హిట్లర్, ముస్సోలినీలే స్ఫూర్తి. తాము ఆర్యుల తెగకు చెందినవారమని వారు నమ్ముతారు. ముస్లింల జాతి నిర్మూలన చేయాలని ఆరెస్సెస్ భావిస్తుంది. ఆరెస్సెస్ శిబిరాల్లో ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారని కాంగ్రెస్‌కు చెందిన మాజీ హోం మంత్రి కూడా ప్రకటించారు. ఆరెస్సెస్ గూండాలు వందలాది మంది ముస్లింలను చంపేశారు. ఆరెస్సెస్ జాత్యహంకార విద్వేష సిద్ధాంతమే గాంధీని చంపింది. గుజరాత్‌లో అల్లర్లకు కారణమైంది.
+ ఆర్యులమనే ఆధిపత్య భావనతో వచ్చేది దురహంకారమే. ఆ గర్వంతో క్రూరమైన చర్యలకు పాల్పడతారు.. అచ్చం మోదీ చేసినట్టుగా. ఆ గర్వంతోనే ప్రధాని మోదీ కళ్లు మూసుకుపోయాయి.
+ కశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేస్తే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసా? కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగించడాన్ని కశ్మీరీ ప్రజలు అంగీకరిస్తారని మోడీ అనుకుంటున్నారా? కశ్మీర్‌లో వేలాదిమంది పిల్లలు నిర్బంధంలో ఉన్నారు. కర్ఫ్యూను ఎత్తివేస్తే వాళ్లంతా వీధుల్లోకి వస్తారు. అక్కడ రక్తపాతం జరుగుతుంది. గత ఐదేళ్లుగా సాగుతున్న అణచివేత ఇకముందూ కొనసాగుతుంది.
+ భారత్‌లో చొరబడటానికి 500 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని వారి రక్షణ మంత్రి చెప్పారు. 9 లక్షల మంది సైన్యంపై 500మంది ఉగ్రవాదుల ప్రభావం ఎంత ఉంటుంది? మరో పుల్వామా ఘటన జరిగితే వారు మళ్లీ మాపై బాంబులు వేస్తారు. సంప్రదాయ యుద్ధం మొదలైతే ఏదైనా జరగొచ్చు.
+ పొరుగుదేశం కన్నా ఏడు రెట్లు చిన్నదైన దేశానికి.. లొంగిపోవాలా? లేక స్వాతంత్య్రం కోసం చనిపోయే వరకూ యుద్ధం చేయాలా? అనే రెండు ప్రత్యామ్నాయాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే? ఈ ప్రశ్న నాకు నేనే చాలాసార్లు వేసుకున్నా. ‘మేం పోరాడతాం’ అని నేను చెప్పగలను. రెండు అణ్వస్త్ర దేశాలు పోరాడితే ఏం జరుగుతుందో ఆలోచించండి. దాని పర్యవసానాలు సరిహద్దులు దాటి ఉంటాయి. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఇది బెదిరింపు కాదు. భయం. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితిపై ఉంది.
+ 9/11 తర్వాత ఇస్లామోఫోబియా పెరడగం ఆందోళనకరం. ఇది ఒక విభజనను సృష్టిస్తోంది. ఇస్లామిక్ ఉగ్రవాదం, రాడికల్ ఇస్లాం లాంటి పదాలతోనే ఇస్లామోఫోబియా పెరుగుతోంది. ఉగ్రవాదానికి ఏ మతంతోనూ సంబంధం లేదు. కానీ, ‘ఇస్లామిక్ ఉగ్రవాదం’ అంటూ పాశ్చాత్య నేతలు మాట్లాడటం, ముస్లింలను తక్కువ చేసి చూడ టం వారిని తీవ్రవాదంవైపునకు నెడుతోంది.
+ కొన్ని దేశాల్లో బుర్ఖా ఒక సమస్యగా.. అదేదో ఆయుధంలాగా చూస్తున్నారు. ఒక మహిళ తన దుస్తులను తీసేయొచ్చుగానీ.. మరిన్ని దుస్తులు వేసుకోకూడదా? ఇదంతా ఇస్లామోఫోబియా వల్లే జరుగుతోంది.