Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ తాజా నిర్ణ‌యంతో భార‌తీయులు ఫిదా ప‌క్కా!

By:  Tupaki Desk   |   29 July 2019 9:18 AM GMT
ఇమ్రాన్ తాజా నిర్ణ‌యంతో భార‌తీయులు ఫిదా ప‌క్కా!
X
దాయాది పాకిస్థాన్ పాల‌కులు ఎప్పుడు భార‌తీయుల మ‌న‌సుల్ని గాయ‌ప‌రిచే నిర్ణ‌యాల్ని తీసుకోవ‌టం క‌నిపిస్తుంది. ఇందుకు భిన్నంగా.. భార‌త్ లోని కోట్లాది మంది మ‌న‌సుల్ని దోచుకునే నిర్ణ‌యాన్ని పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెప్పాలి. సంచ‌ల‌నంగా మారిన ఈ నిర్ణ‌యం ఏమంటే.. దాదాపు 72 ఏళ్ల క్రితం మూసివేసిన ఒక హిందూ ఆల‌యాన్ని తిరిగి తెర‌వాల‌న్న నిర్ణ‌యాన్ని పాక్ ప్ర‌భుత్వం తీసుకుంది.

అంతేకాదు.. ఈ ఆల‌య పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు వెంట‌నే చేప‌ట్టాల‌ని.. దాని ప‌రిర‌క్ష‌ణ‌కు ప‌నులు చేయాల‌ని నిర్ణ‌యించారు. పాక్ లోని సియాలో కోట్ లో ఉన్న వెయేండ్ల చ‌రిత్ర ఉన్న హిందూ దేవాల‌యాన్ని తిరిగి తెర‌వాలంటూ పాక్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అంతేకాదు.. భ‌క్తుల సంద‌ర్శ‌నార్థం ఉంచాల‌ని డిసైడ్ అయ్యారు.

అయోధ్య‌లోని వివాదాస్ప‌ద క‌ట్టాన్ని కూల్చివేసిన స‌మ‌యంలో.. పాక్ లోని ఒక గుంపు ఈ ఆల‌యాన్ని ధ్వంసం చేశారు. అప్ప‌టి నుంచి ఈ దేవాల‌యం వైపున‌కు పాక్ లోని హిందువులు వెళ్ల‌టం మానేశారు. స‌ర్దార్ తేజా సింగ్ నిర్మించిన‌ట్లుగా చెప్పే షావాలా తేజా సింగ్ ఆల‌యం.. భార‌త్-పాక్ విభ‌జ‌న స‌మ‌యంలో మూత‌ప‌డింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ అది తెర‌వ‌లేదు.

తాజాగా ఇమ్రాన్ ప్ర‌భుత్వం తెర‌వాల‌న్న సంచ‌ల‌న నిర్ణ‌యంతో పాటు.. ప్ర‌జ‌లు స్వేచ్ఛ‌గా ఎప్పుడైనా గుడిని ద‌ర్శించుకోవ‌చ్చ‌న్న మాట‌ను ప్ర‌భుత్వ అధికారులు చెబుతున్నారు. ఆల‌యానికి చేయాల్సిన రిపేర్లు చేసి.. ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం అందుబాటులోకి తేనున్నారు. ఈ నిర్ణ‌యం క‌చ్ఛితంగా భార‌తీయుల మ‌న‌సుల్ని దోచుకోవ‌ట‌మే కాదు.. ఇమ్రాన్ కు ఫిదా అయ్యేలా చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.