Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ వార్నింగ్... ఇక అణు యుద్ధమేనట

By:  Tupaki Desk   |   31 Aug 2019 3:18 PM GMT
ఇమ్రాన్ వార్నింగ్... ఇక అణు యుద్ధమేనట
X
దాయాదీ దేశం పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తాజాగా జారీ చేసిన హెచ్చరికలు... ఒక్క భారత్ కే కాకుండా యావత్తు ప్రపంచానికి వర్తించేలానే ఉన్నాయని చెప్పక తప్పదు. భారత్ - పాక్ ల మధ్య నలుగుతున్న కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించని పక్షంలో ఈ రెండు దేశాల మధ్య అణు యుద్ధం తప్పదని, అదే జరిగితే... ఈ యుద్ధం కారణంగా భారత్ - పాక్ లకే కాకుండా యావత్తు ప్రపంచ దేశాలకూ ప్రమాదమేనని ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఇమ్రాన్ కలకలరే రేపినట్టుగా కనిపిస్తున్నా... అంతర్జాతీయ సమాజం మద్దతు కోసమే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆన్ లైన్ ఎడిషన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం ఇమ్రాన్ ఇంటర్వ్యూ ఇవ్వగా... ఆ పత్రిక దానిని శనివారం నాటి తన ఆన్ లైన్ ఎడిషన్ లో ప్రచురించింది. ఈ ఇంటర్య్వూలో ఇమ్రాన్ అణు యుద్ధాన్ని బేస్ చేసుకునే... మొత్తంగా దాని చుట్టూనే తన దృష్టిని కేంద్రీకరించి మాట్లాడినట్లుగా స్పష్టంగానే తెలుస్తోంది. అంతర్జాతీయ సమాజం భారత్ వైపు నిలబడ్డ వైనాన్ని కూడా ప్రస్తావించిన ఇమ్రాన్... ఈ తరహా వైఖరి ప్రపంచ దేశాలకు మంచిది కాదన్న రీతిలోనూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ సమాజం ఇదే తరహా వైఖరితో ముందుకు సాగితే... కాశ్మీర్ అంశం పరిష్కారం అయ్యే అవకాశాలే లేవన్న రీతిలో కాస్తంత లోతైన విశ్లేషణతో కూడిన వ్యాఖ్యలే చేసిన ఇమ్రాన్... కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకపోతే... భారత్ తో తాము ప్రత్యక్ష యుద్ధానికి దిగక తప్పని పరిస్థితి నెలకొందని నర్మగర్బ వ్యాఖ్యలే చేశారు.

అదే జరిగితే... అణ్వస్త్రాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే... అణ్వస్త్రాల వినియోగం కూడా సాధారణమే కదా... అదే జరిగితే ఈ యుద్ధం భారత్ - పాక్ లకే కాకుండా యావత్తు ప్రపంచ దేశాలకు కూడా ముప్పేనని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్ పైనా - అక్కడి ప్రజలపైనా భారత్ చేస్తున్న దాడులను అంతర్జాతీయ సమాజం నిలువరించాలని - లేని పక్షంలో అణ్వస్త్రాలు కలిగిన రెండు దేశాల మధ్య నెలకొనే యుద్ధం మొత్తం ప్రపంచ దేశాలకు వినాశకారిగానే పరిణమించే ప్రమాదం లేకపోలేదని ఇమ్రాన్ కాస్తంత ఘాటు వ్యాఖ్యలే చేశారు.

కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భాతర్ తో అంశాల వారీగా చర్చలకు పాక్ సిద్దంగానే ఉందన్న విషయాన్ని మరోమారు ప్రస్తావించిన ఇమ్రాన్... ఈ విషయాన్ని భారత్ గుర్తెరగడం లేదని ఆక్షేపించారు. తనదైన మొండి వైఖరితో ముందుకు సాగుతున్న భారత్ ను నిలువరించాల్సిన అంతర్జాతీయ సమాజం.... అంతర్జాతీయ వేదికల మీద భారత్ కు వత్తాసు పలకడం ఎంతవరకు సమంజసమని కూడా ఇమ్రాన్ ప్రశ్నించారు. మొత్తంగా భారత్ - పాక్ ల మధ్య యుద్ధం... అది కూడా అణు యుద్దం జరిగితే.... ఆ పాపం భారత్ - పాక్ దేశాలది కాదని - అంతర్జాతీయ సమాజానిదే ఆ బాధ్యత అని కూడా ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.