Begin typing your search above and press return to search.
ఇమ్రాన్ ఇన్విటేషన్ ను మోడీ రిజెక్ట్ చేస్తే..?
By: Tupaki Desk | 2 Aug 2018 5:01 AM GMTదాయాది పాకిస్థాన్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒకనాటి క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ విజయం సాధించటం.. ఆయన నేతృత్వంలో సంకీర్ణ సర్కారు దిశగా అడుగులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. పాక్ ప్రధానిగా తన ప్రమాణస్వీకారానికి భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలన్న ఆలోచనలో ఇమ్రాన్ ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. ఇమ్రాన్ ఆలోచన మీద పాక్ అధికారులకు మహా ఇబ్బంది ఒకటి వచ్చి పడిందంటున్నారు.
పాక్ ప్రధానిగా ఇమ్రాన్ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి భారత ప్రధాని మోడీని ఆహ్వానం పంపిన తర్వాత ఆయన కానీ రిజెక్ట్ చేస్తే.. అంతర్జాతీయంగా పాక్ పరువుకు దెబ్బ పడుతుంది. ఈ ప్రమాదం పొంచి ఉన్న వేళ.. మోడీకి ఆహ్వానం పంపటం రిస్క్ గా పాక్ అధికారులు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారోత్సవానికి భారత ప్రధాని మోడీతో పాటు.. చైనా అధినేత జిన్ పింగ్.. టర్కీ అధ్యక్షుడు ఎర్డొగన్.. సార్క్ దేశాధినేతల్ని పిలవాలన్న ఆలోచనలో ఇమ్రాన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఆహ్వానాన్ని మోడీ రిజెక్ట్ చేస్తే ఇబ్బందిగా పాక్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మోడీని పిలవకుండా ఉండాలా? అన్న దానిపై తేల్చుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. తన పాత పరిచయస్తులైన మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్.. సునీల్ గవాస్కర్ లకు ఇమ్రాన్ ఆహ్వానాన్ని పంపినట్లుగా చెబుతున్నారు.
మరోవైపు.. తాను ఉండే నివాసాన్ని ఇమ్రాన్ ఖాళీ చేశారు. మంత్రులు నివాసం ఉండే మరో ఇంటిని ఇమ్రాన్ ఓకే చేశారు. ప్రస్తుతం పాక్ ప్రధాని నివాసం ఉన్న గృహంలో తాను ఉండనని గతంలోనే ఇమ్రాన్ వెల్లడించారు. ఇప్పుడు ఇమ్రాన్ ఉన్న ఇంట్లో ఉన్న పక్షంలో భద్రత ఏర్పాట్లకు ఇబ్బందిగా ఉంటుందన్న సూచనతో ఆయన మంత్రులు ఉండే నివాసాల్లో ఒక దాన్ని ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ.. ఇమ్రాన్ ఆహ్వానాన్ని మోడీ ఏం చేస్తారో చూడాలి.