Begin typing your search above and press return to search.

ఓర్లాండో హీరో భారత సంతతి వ్యక్తి

By:  Tupaki Desk   |   17 Jun 2016 10:02 AM GMT
ఓర్లాండో హీరో భారత సంతతి వ్యక్తి
X
అమెరికాలోని ఓర్లాండోలో ఇటీవల జరిగిన నరమేధంలో ఉగ్రవాది మతీన్ విలన్ కాగా భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి ఇప్పుడు హీరోగా అవతరించాడు. ఆ నరమేధం నుంచి 70 మంది అమాయకుల ప్రాణాలను రక్షించిన ఆయన ఇప్పుడు అమెరికన్ల దృష్టిలో హీరోగా నిలిచాడు. ఘటన జరిగిన క్లబ్బులోనే పనిచేసే ఆయన సాహసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి నోటా వినిపిస్తోందతి. దుస్సంఘటన జరిగిన వెంటనే వేగంగా స్పందించిన అతడు ఎంతోమంది ప్రాణాలను కాపాడాడు. దీంతో అని పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది.

భారత సంతతికి చెందిన అమెరిక పౌరుడు ఇమ్రాన్ యూసఫ్ ఒకప్పుడు అమెరికన్ నావికా దళంలో పనిచేశాడు. అందులో రిటైర్ అయిన తరువాత ఓర్లాండో గే క్లబ్బులోనే బూస్టర్ గా పనిచేస్తున్నాడు. దాంతోపాటు - క్లబ్బులోనే గేలకు భోజనం వడ్డిస్తుంటాడు. ఈ నెల 12న ఉగ్రవాద భావజాల ప్రేరేపితుడైన మతీన్ అనే వ్యక్తి స్వలింగ సంపర్కుల పల్స్ క్లబ్ పై కాల్పులకు తెగబడినప్పుడు ఇమ్రాన్ అక్కడ విధుల్లో ఉన్నాడు. ఘటన జరగడానికి ముందు క్లబ్బులో కాల్పుల శబ్దం విన్న ఇమ్రాన్ వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. కాల్పులు జరుగుతున్నప్పుడు అంతా ప్రాణభయంతో అటుఇటు పరుగెడుతుండగా అతడు మాత్రం కాల్పులు కూడా లెక్కచేయకుండా షూటర్ ముందునుంచే క్లబ్బు వెనుక డోర్ తీసేందుకు పరిగెత్తాడు. అంతటి గందరగోళంలో కూడా సురక్షితంగా డోర్ తీసి 70మంది ప్రాణాలు కాపాడాడు. ఇతడి ధైర్యానికి మెచ్చుకొని అక్కడి మీడియా ప్రశంసల జల్లు కురిపిస్తోంది.

కాగా ఇమ్రాన్ గతంలో అప్ఘనిస్థాన్ లో అమెరికా నౌకాదళం తరఫున పనిచేశాడు. అప్పటి నుంచి ఆయనలో తెగువ, సాహసం పాళ్లు ఎక్కువే. క్లబ్బులో కాల్పులు జరగ్గానే పెను ప్రమాదం సంభవిస్తోందని గుర్తించి ఆయన వెంటనే స్పందించి ప్రాణాలు కాపాడాడు. అయినప్పటికీ ఈ కాల్పుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఇమ్రాన్ కనుక సాహసం చేయకపోతే మృతుల సంఖ్య 100 దాటేది.