Begin typing your search above and press return to search.

2023 ఎన్నిక‌లు : కేసీఆర్ పోటీచేసే నియోజ‌క‌వ‌ర్గం అదేనా?

By:  Tupaki Desk   |   21 March 2022 1:30 AM GMT
2023 ఎన్నిక‌లు : కేసీఆర్ పోటీచేసే నియోజ‌క‌వ‌ర్గం అదేనా?
X
త‌న బ‌ల‌ము క‌న్న స్థాన బ‌ల‌ము మిన్న అని అంటారు.కేసీఆర్ త‌న బ‌లం ఎప్పుడో నిరూపించారు ఇప్పుడు స్థానం మార్పుతో స్థాన బ‌లం క‌న్నా త‌న బ‌ల‌మే మిన్న అని నిరూపించేందుకు సిద్ధం అవుతుండ‌డం విశేషం.ఇదే సమ‌యంలో రాజ‌కీయంగా మ‌రింత‌గా ఎదిగేందుకు ముఖ్యంగా త‌నదైన మార్కు పాల‌న‌ను వేగ‌వంతం చేసేందుకు ఓ కొత్త నియోజ‌క‌వ‌ర్గం ఎంపిక‌కు తెలంగాణ చంద్రుడు ప్రాధాన్యం ఇవ్వ‌డం విశేషం.

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తాయి అని మీడియా ఊద‌ర‌గొట్టినా కూడా కేసీఆర్ వాటిని ప‌ట్టించుకునే స్థితిలో లేరు.ఐదేళ్ల పాల‌న పూర్త‌య్యాకే ఎన్నిక‌ల‌కు వెళ్తార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌చ్చాకే చాలా మార్పులు వ‌చ్చాయ‌ని రాజ‌కీయేత‌ర శ‌క్తుల ఏకీక‌ర‌ణ కూడా ఆ రోజు త‌మ‌తోనే సాధ్యం అయింద‌ని అదేవిధంగా ఇప్పుడు కూడా తామే విజ‌య దుందుభి మోగించ‌నున్నామ‌ని కూడా గులాబీ శ్రేణులు కాన్ఫిడెన్స్ తో చెబుతున్నాయి.

వ‌చ్చే ఎన్నిక‌లు ఎలా ఉన్నా ఇప్ప‌టి నుంచి అంతా సిద్ధం చేసుకోవాల‌న్న తాప‌త్ర‌యంలో కేసీఆర్ ఉన్నారు.2023నాటికి జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌లు ఆయ‌న జీవితాన్ని ఏ విధంగా ప్ర‌భావితం చేస్తాయి అన్న‌ది ఓ పెద్ద ప్ర‌శ్న‌గానే ఉంది.ఎందుకంటే రాజ‌కీయంగా జీవితాన్నిచ్చిన గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆయ‌న వ‌దిలేయాల‌ని అనుకుంటున్నారు.

మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని చూస్తున్నారు.అంటే ఈ సారి కూడా ఆయ‌న ఎమ్మెల్యేగానే పోటీచేస్తారు అంటే జాతీయ రాజ‌కీయాల‌పై ఆయ‌న‌కు ఆస‌క్తి లేద‌నే తేలిపోయింది.ద‌క్షిణ తెలంగాణ‌లో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ఆయ‌న ఎంపిక ఈ విధంగా ఉంద‌ని ప్ర‌ధాన స్ర‌వంతిలో ఉన్న మీడియా వెల్ల‌డి చేస్తోంది.ఇప్ప‌టికే ఈ విష‌య‌మై ఆ ప్రాంత నాయ‌కుల‌తో కేసీఆర్ మాట్లాడార‌ని వారి స‌మ్మ‌తి ఎలాఉందో కూడా అడిగి తెలుసుకున్నారు అని కూడా ఆ మీడియా క‌థ‌నం స్ప‌ష్టం చేస్తోంది.

ఇక రాష్ట్రంలో కొత్త పార్టీల పుట్టుక కూడా లేక‌పోవ‌డంతో ఉన్న పార్టీల‌లో ప్ర‌త్య‌ర్థి ఎవ‌ర‌న్న‌ది తేల్చుకోవ‌డం కూడా పెద్ద‌గా ఇవాళ క‌ష్ట‌ప‌డ‌న‌వ‌స‌రం లేదు.ఆ రోజు కేసీఆర్ ఉన్న స్థితికీ ఇవాళ కేసీఆర్ ఉన్న స్థితికీ ఎంతో తేడా ఉంది. బీజేపీకి కానీ కాంగ్రెస్ కు కానీ చెప్పుకునే స్థానాలు రావు.అవి ఉన్నంత మాత్రాన గెలుపున‌కు సంకేతాలు ఇచ్చే విధంగా ఉన్నాయి అని అనుకోలేం.బ‌హుజ‌న స‌మాజ్ వాదీ పార్టీ నేత ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కూడా పెద్ద‌గా ప్ర‌భావం చూపే అవ‌కాశాలే లేవు.దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపు త‌థ్యం.

ఇదే స‌మ‌యంలో ఆయ‌న సూచ‌న‌తోనే వైఎస్సార్టీపీ ఏర్పాటు అయింది అన్న వాద‌న కూడా ఒట్టిదేన‌ని తేలిపోయింది. షర్మిల పార్టీకి అనూహ్య మ‌ద్ద‌తు అయితే తెలంగాణ నేల‌లో ద‌క్క‌దు. అదేదో పాట‌లో చెప్పిన విధంగా తిట్టినా నువ్వే కొట్టినా నువ్వే అన్న విధంగా తెలంగాణ‌లో కేసీఆర్ కు మ‌రో ప్ర‌త్యామ్నాయం లేరు రారు ఉండ‌రు కూడా! ఫిల్మ్ ఇండ‌స్ట్రీ కూడా ఆయ‌న‌తోనే ఉంది.ఆయ‌న ఇచ్చిన రాయితీలు అన్నీ బాగున్నాయి అని చిరంజీవి లాంటి పెద్ద‌ల మాట‌ల‌ను గౌర‌వించే తీరు కూడా బాగుంద‌ని అంతా అంటున్నారు.క‌నుక జ‌గ‌న్ క‌న్నా కేసీఆర్ ఎన్నో రెట్లు మేలు అన్న భావ‌నకు ఇండ‌స్ట్రీ ఓ సంద‌ర్బంలో వ‌చ్చింది కూడా! అదే ఇవాళ నిరూపితం కూడా!