Begin typing your search above and press return to search.
తొలిసారి హైకోర్టు జడ్జిపై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం
By: Tupaki Desk | 31 July 2019 6:04 AM GMTదేశ చరిత్రలో ఎప్పుడూ చోటు చేసుకొని సంచలనం ఒకటి తెర మీదకు వచ్చింది. హైకోర్టు న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్.. సీబీఐ విచారణకు ఆదేశిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఎన్ శుక్లాపై సీబీఐ విచారణకు సీజే రంజన్ గొగోయ్ ఆదేశాలు జారీ చేశారు. ఒక హైకోర్టు న్యాయమూర్తి మీద సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించటం ఇదే తొలిసారి.
ఇంతకూ ఇలాంటి ఆదేశాలు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి మీద ఎందుకు జారీ అయ్యాయి? దీనికి అసలేం జరిగింది? అన్న విషయాల్లోకి వెళ్లితే.. రెండేళ్ల క్రితం 2017-2018 విద్యా సంవత్సరంలో గుజరాత్ లోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఆడ్మిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే.. వీటిని పట్టించుకోకుండా ఉత్తర్వుల్ని జారీ చేయటంతో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఎన్ శుక్లా వ్యవహారం తెర మీదకు వచ్చింది. ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అంతర్గత విచారణకు అప్పటి సీజే ఆదేశాలు జారీ చేశారు.
జస్టిస్ శుక్లా మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ.. సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ కే అగ్నిహోత్రి.. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీకే జైస్వాల్ తో అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలింది. దీనికి సంబందించిన నివేదికను వారు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనపై సీబీఐ విచారణ చేయించాలంటూ కేంద్రాన్ని కోరారు. సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తే స్వయంగా కేంద్రానికి లేఖ రాయటంతో ఆయన.. సీబీఐ విచారణ ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది.