Begin typing your search above and press return to search.
రిపబ్లిక్ డేలో ఇపుడు రికార్డ్
By: Tupaki Desk | 26 Jan 2016 7:36 AM GMT67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పలు ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ వేడుకలు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఈ ఉదయం 9.25 గంటలకు వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇటీవలి జరిగిన పలు ఉగ్రదాడుల నేపథ్యంలో, ఐబీ హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతా దళాలు ఢిల్లీలో మూడంచెల భద్రతను అమలు చేశాయి. ఈ క్రమంలో కొత్త సంప్రదాయాన్ని తెరమీదకు తేవడంతో పాటు గతంలో నిర్వహించిన పలు గణతంత్ర విధానాలను కూడా పాటించారు.
ఇండియా గేట్ వద్ద అమర సైనికులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ - ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండె - ప్రధాని మోదీ - కేంద్ర మంత్రి మనోహార్ పారికర్ కూడా శద్ధ్రాంజలి ప్రకటించారు. త్రివిధ దళాలధిపతులు కూడా శ్రద్ధాంజలి ఘటించారు. అమర్ జవాన్ జ్యోతి వద్ద సైన్యాధిపతి జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ - వాయుసేనాధిపతి మార్షల్ అరూప్ రాహా - నౌకా సేనాధిపతి అడ్మిరల్ ఆర్కే ధోవన్ పుష్పాంజలి సమర్పించారు. సైనికులు గన్ సెల్యూట్ చేశారు. ప్రధాని మోదీ అమరజ్యోతి వద్ద ప్రత్యేకంగా పుష్పగుచ్ఛాన్ని ఉంచారు. ఆ తర్వాత రెండు నిమిషాల మౌనాన్ని పాటించారు.
67వ గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రత్యేకతలు ఇవి
--26 ఏళ్ల తర్వాత జాగిలాలు వేడుకల్లో పాల్గొంటున్నాయి
-- ఇండియన్ ఆర్మీతో పాటు పరేడ్ లో ఫ్రెంచ్ దళాలు పాల్గొన్నాయి
--మహిళా జవాన్ల బైక్ విన్యాసాలు
-- 115 నిమిషాల నుంచి 90 నిమిషాలకు పరేడ్ కుదించారు
--వీవీఐపీలు కూర్చునే గ్లాస్ కేబిన్ కు గ్లాస్ పైకప్పు
-- ఢిల్లీ మీదుగా విమానాల రాకపోకలు నిషేధించారు, డ్రోన్లతో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.