Begin typing your search above and press return to search.
వెంకయ్యలో చతురోక్తులు తగ్గేట్టుగా లేవే!
By: Tupaki Desk | 23 Sep 2017 4:45 AM GMTతెలుగు - హిందీ - ఇంగ్లిష్.. ఏ భాష అయినా సరే.. అంత్య ప్రాసలతో ఆకట్టుకుంటూ.. చతురోక్తులు - ఛలోక్తులతో ప్రజలను ఆకట్టుకోవడంలో ఎవరైనా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి తర్వాతే. సూటిగా, స్పష్టంగా ఉండే ఆయన పంచ డైలాగులకు ప్రతిఫక్షాలు కూడా బెదిరిపోయేవి. అయితే ఇటీవల క్రియాశీలక రాజకీయాల నుంచి అంతగా పని లేని ఉపరాష్ట్రపతి పదవికి ఆయన ఎంపికవడంతో ఆయన చతురోక్తులు తగ్గిపోయాయి.
అయితే తాజాగా పంజాబ్ లోని మొహాలి నగరంలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ)లో జరిగిన నాయకత్వ సదస్సులో ప్రసంగించిన ఆయన తన మాటలతో విద్యార్థులను ఆకట్టుకున్నారు. తాను పాలిటిక్స్ నుంచి రిటైర్ అయ్యాను కానీ - టైర్ కాలేదని ఛలోక్తులు విసిరారు. దేవతల గురించి మాట్లాడుతూ పూర్వకాలంలో దుర్గా మాత మనకు రక్షణ మంత్రయితే.. లక్ష్మీదేవి ఆర్థిక శాఖ మంత్రి అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పడం గమనార్హం. గతంలోనూ ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక కాకముందు నేను ఉషాపతినే కానీ ఉపరాష్ట్రపతిని కాదని విలేకరులపై చతురోక్తులు విసిరారు. ఆయన సతీమణి పేరు ఉష కావడంతో ఆయన పై విధంగా అనడంతో నవ్వులు విరిశాయి.
మనసు నుంచి మాట్లాడాలని.. తాను అలాగే మాట్లాడతానని అని విద్యార్థులతో అన్నారు. మాతృభాష తెలియని వాళ్లతోనే వేరే భాషలో మాట్లాడాలని.. లేదంటే అమ్మ భాషలోనే మాట్లాడాలని చెప్పారు. ఇప్పటికీ రామరాజ్యం గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే అది అప్పటి పరిపాలనా విధానమే అని ఆయన విద్యార్థులనుద్దేశించి పేర్కొ్న్నారు.