Begin typing your search above and press return to search.

ఏపీలో ముంద‌స్తు ఖాయ‌మే.. టార్గెట్ రీచ్ కావ‌డ‌మే లేటు?

By:  Tupaki Desk   |   27 Sep 2022 11:33 AM GMT
ఏపీలో ముంద‌స్తు ఖాయ‌మే.. టార్గెట్ రీచ్ కావ‌డ‌మే లేటు?
X
ఏపీలో ముంద‌స్తు ఉంటుందా? ఉండ‌దా? ఇది కొన్నాళ్లుగా హాట్ డిబేట్ అయిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై వైసీపీ నాయ‌కులు ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ ఇవ్వ‌లేదు. ఉంటుంద‌ని.. కానీ,, ఉండ‌ద‌ని కానీ.. చెప్ప‌లేదు. అయితే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ప‌క్కాగా క‌స‌ర‌త్తు జ‌రుగుతున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. దీనికి కొన్నాళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని అంటున్నారు.

వాస్త‌వానికి షెడ్యూల్ ప్ర‌కారం.. ఐదేళ్లు నిండేందుకు 2024 దాకా వెయిట్ చేయాలి. అయితే.. ప్ర‌స్తుతం అప్ప‌టి దాకా వెయిట్ చేయ‌కుండా.. ముందే ఎన్నిక‌ల‌కు వెళ్లే వ్యూహాన్ని వైసీపీ ప‌రిశీలిస్తోంది. ప్ర‌ధానంగా మూడు కార‌ణాలు దీనికి ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఒక‌టి.. ప్ర‌తిప‌క్షాలు కూట‌మి క‌ట్టే లోగానే.. తాము ఎన్నిక‌ల‌కు వెళ్లిపోవ‌డం.. రెండు ఆర్థికంగా.. అప్పులు దొర‌క‌ని ప‌రిస్థితి వ‌ర‌కు ఉండ‌కుండా.. ఎన్నిక‌లకు వెళ్ల‌డం. మూడు.. తాము మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల‌ను 100 శాతం పూర్తి చేసేయ‌డం.

ఈ మూడు అంశాల‌పైనే.. అధిష్టానం..తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం.. రాష్ట్రంలో ఏయే పార్టీలుక‌లిసి ముందుకు సాగుతాయ‌నే విష‌యంపై ఇంకా క్లారిటీ లేదు. టీడీపీ-జన‌సేన క‌లుస్తుం ద‌ని అంటున్నారు.

ప‌క్క‌న బీజేపీ ఉంది. సో.. ఆ పార్టీ ఈ కూట‌మికి ఒప్పుకుంటుందా? లేదా? అనేది ప్ర‌ధాన స‌మ‌స్య‌. ఇప్పుడిప్పుడే.. చంద్ర‌బాబు బీజేపీకి ద‌గ్గ‌ర‌వుతున్న ప‌రిస్థితి ఉంది. ఇది ముదిరేలోగానే.. ముంద‌స్తుకు వెళ్లిపోతే.. బెట‌ర్ అని వైసీపీ ఆలోచ‌న‌.

ఇక‌. తాము అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు డ‌బ్బులు ఇప్ప‌టి వ‌ర‌కు ఏదో ఒక రూపంలో తెచ్చుకుంటున్నారు. సెక్యూరిటీల‌ను వేలం వేస్తున్నారు. అయితే.. ఇది మ‌రో 6 మాసాల్లో ముగిసిపోవ‌డం ఖాయం. అప్పుడు నిధులు స‌మ‌స్య‌గా మారే ఛాన్స్ ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ గ‌డువు ముగిసేలోగానే ముందుకు వెళ్లిపోయి.. ప్ర‌జ‌ల‌తో ఓట్లు వేయించుకునే ఛాన్స్ కోసం వైసీపీ ఎదురు చూస్తోంది. ఇక,, మూడో ది.. తాము ఇచ్చిన మేనిఫెస్టో హామీలు. న‌వ‌ర‌త్నాలు.

ఇది ఇప్ప‌టికే 98.5 శాతం. అమ‌లు చేశామ‌ని.. సీఎం ఇటీవ‌ల చెప్పారు. సో.. ఇది 100 శాతం పూర్తికాగానే.. ముంద‌స్తుకు వెళ్లిపోయే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనికి పెద్ద‌గా స‌మ‌యం కూడా లేద‌ని.. వ‌చ్చే మే .. లేదా జూన్ లో అమ్మ ఒడి సొమ్ములు వేయ‌గానే.. ముంద‌స్తు ప్ర‌క‌ట‌న చేయొచ్చ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.