Begin typing your search above and press return to search.
వీర్యం ఇవ్వండి....ఐఫోన్ 6s పొందండి !
By: Tupaki Desk | 18 Sep 2015 2:10 PM GMTఐఫోన్ 6s...ఈ ఫోన్ కు ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేనిది. ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉందో చైనాలో ఇంకాస్త ఎక్కువగానే ఉంది. సొమ్ములు లేని వారు ఈ ఫోన్ ను సొంతం చేసుకునేందుకు రకరకాల తిప్పలు పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు చైనాకు చెందిన ఓ వ్యక్తి తన కిడ్నీని అమ్ముకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ బాధలు ఏం లేవు. సూపర్ ఆఫర్ ఒకటి చైనాలో అందుబాటులోకి వచ్చింది. చైనాకు చెందిన స్పెర్మ్ బ్యాంక్ (వీర్య నిధి బ్యాంకు) కొత్త స్కీమ్ ను ప్రవేశపెట్టింది. 17 మిల్లీలీటర్ల వీర్యం దానం చేస్తే...రూ 60,000 వారికి ఇవ్వనుంది. ఈ మొత్తంతో రోజ్ గోల్డ్ కలర్ ఐఫోన్ 6sను కొనుగోలు చేయవచ్చు.
ఆఫరేదో బాగానే ఉందే అనుకుంటున్నారా... బాగానే ఉంది. అయితే కొన్న షరతులు కూడా ఉన్నాయి. ఇలా వీర్యం దానం చేసే వ్యక్తి కనీసం 165 అడుగుల పొడవు ఉండాలి. ఆయనకు వంశపారంపర్య వ్యాధులేవీ ఉండద్దు. ఆయన చైనా దేశస్తుడు అయి ఉండాలి. వీటన్నింటితో పాటు ఆయన డిగ్రీ కూడా చదవి ఉండాలి.
ఇవన్నీ ఓకే అయితే తర్వాత కూడా ఓ పరీక్ష కూడా ఉంటుందండోయ్. వీర్యం ఇచ్చేందుకు ముందుకువచ్చిన వారికి స్థానిక రుజిన్ ఆస్పత్రిలో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఆ దాత యొక్క వీర్యకణాల ఉత్పత్తి శాతాన్ని లెక్కిస్తారు. కండిషన్లు ఎన్ని ఉన్నా.... ఆఫర్ సూపర్‌గా ఉండటంతో... ఈ ప్రకటన వచ్చిన 3 రోజుల్లోనే 22,000 మంది ఐఫోన్ 6sను ఈ స్కీమ్ లో పొందేందుకు ముందుకు వచ్చారు.