Begin typing your search above and press return to search.

నాకు ఆమెతో శారీర‌క సంబంధం ఉంది..ట్రంప్ సంగ‌తేంటి?

By:  Tupaki Desk   |   5 Jun 2018 3:30 PM GMT
నాకు ఆమెతో శారీర‌క సంబంధం ఉంది..ట్రంప్ సంగ‌తేంటి?
X
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. త‌న జీవితాన్ని తీవ్రంగా కుదిపేసిన‌ - ఓ మ‌చ్చ‌గా మిగిలిపోయిన అంశం గురించి ఆయ‌న చాలాకాలం త‌ర్వాత మ‌ళ్లీ స్పందించారు. మోనికా లూయిన్‌ స్కీ అనే మ‌హిళ‌తో అఫైర్ ఎంతగా భ్రష్టు పట్టించిందో తెలిసిన సంగ‌తే. ప్రపంచవ్యాప్తంగా ఆయన పరువు తీసిన అఫైర్ ఇది. క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మోనికా లూయిన్‌ స్కీ వైట్‌ హౌజ్‌ లో ఇంటెర్న్‌గా పనిచేసేది. 1995 నుంచి 1997 మధ్య ఆమెతో క్లింటన్ శారీరక సంబంధం ఏర్పరచుకున్నారని ఆరోపణలు వచ్చాయి. 1998లో ఈ విషయం బయటపడింది. ఈ విషయంలోనే హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఆయనపై అభిశంసన తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. ఈ ఇద్దరి మధ్య శారీరక సంబంధం నిజమేనని తర్వాత విచారణలో వెల్లడైంది.

అయితే, 20 ఏళ్ల కిందట అమెరికాను కుదిపేసిన ఈ అఫైర్‌ పై క్లింటన్ మరోసారి స్పందించారు. ఎన్‌ బీసీ న్యూస్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను మోనికా లూయిన్‌ స్కీకి క్షమాపణ చెప్పాల్సిన పని లేదని స్పష్టంచేశారు. ``నేను తప్పు చేశాను. అప్పుడూ అదే మాట చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నాను. మా కుటుంబానికి - మోనికా లూయిన్‌ స్కీకి - ఆమె కుటుంబానికి - అమెరికా ప్రజలకు వైట్‌ హౌజ్‌ లోని మంత్రులందరి ముందు పబ్లిగ్గా క్షమాపణ కూడా చెప్పాను`` అని క్లింటన్ గుర్తు చేశారు. లూయిన్‌ స్కీకి క్షమాపణ బాకీ పడ్డారా అని ప్రశ్నించగా.. లేదు.. నేను ఎప్పుడూ ఆమెతో మాట్లాడలేదు. కానీ నేను చాలాసార్లు పబ్లిగ్గానే ఈ విషయంలో సారీ చెప్పాను అని క్లింటన్ అన్నారు. తమ బంధం బయటపడిన తర్వాత ఇంకెప్పుడూ తాను ఆమెను కలవలేదని బిల్ క్లింటన్ స్పష్టంచేశారు. ఇదంతా బయటపడిన తర్వాత కూడా తాను అధ్యక్షుడిగా కొనసాగడాన్ని కూడా క్లింటన్ సమర్థించుకున్నారు. ``నిజానికి ఇప్పుడు అధ్యక్షుడుగా ఉన్న ట్రంప్‌ పై కూడా ఇలాంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. అయినా ప్రజలు అవన్నీ పట్టించుకోవడం లేదు. నేను అప్పుడు సరైన పనే చేశాను`` అని క్లింటన్ పేర్కొంటూ ట్రంప్‌ ను ఇర‌కాటంలో ప‌డేసే కామెంట్లు చేశారు. మీటూ ప్రచారం సందర్భంగా క్లింటన్ - లూయిన్‌ స్కీ బంధంపై కూడా విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ ``మీ టూ ప్రచారానికి కూడా నేను మద్దతు తెలుపుతున్నాను. నిజానికి ఇది ఎప్పుడో చేయాల్సింది. దీనిపై చర్చ కొనసాగాల్సిన అవసరం కూడా ఉంది`` అని క్లింటన్ అన్నారు.