Begin typing your search above and press return to search.
ఢిల్లీ కారు ప్రమాదం కేసులో.. స్నేహితులపై అనుమానం..!
By: Tupaki Desk | 9 Jan 2023 2:30 PM GMTనూతన సంవత్సరం రోజున ఢిల్లీలో ఓ యువతిని కారు 20 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది. యువతిని కారుతో యాక్సిడెంట్ చేయడమే కాకుండా ఆపకుండా రోడ్డు వెంట ఈడ్చుకెళ్లిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్ కాదని కావాలనే ప్లాన్ ప్రకారమే యువతిని కారుతో గుద్ది హత్య చేశారనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. దీంతో ఢిల్లీ లెఫ్ట్ గవర్నర్ ఈ ఘటనకు బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆప్ నేతలు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ విషయంపై సమగ్ర దర్యాప్తుకు కేజ్రీవాల్ సర్కార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే కారు ప్రమాదంలో మృతి చెందిన అంజలీ సింగ్ ఇంట్లో తాజాగా చోరీ జరగడం కలకలం రేపుతోంది.
అంజలీ సింగ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో చోరి జరిగిన సమయంలో ఎవరూ లేరు. పక్కింటి వాళ్లు తమకు ఫోన్ చేసి చోరి జరిగిందని సమాచారం ఇవ్వగా ఇంటికి వెళ్లారు. అప్పటికే ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోని ఎల్సీడీ.. ఇతర వస్తువులు.. బెడ్ కింద దాచి ఉంచిన కొన్ని విలువైన వస్తువులు కన్పించలేదని అంజలి సోదరి మీడియాకు వివరించారు. ఈ చోరి వెనుక అంజలి స్నేహితురాలు నిధి హస్తం ఉందని ఆరోపించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్కూటిపై వెళుతున్న అంజలీ సింగ్ ను ఓ కారు బలంగా ఢీ కొట్టి 20 కిలోమీటర్లు ఈడ్చుకెళ్ళింది. ఈ సమయంలోనూ అంజలి స్నేహితురాలు నిధి అక్కడే ఉందని తర్వాత బయటికి వచ్చింది. ఈ ప్రమాద సంఘటన చూసి భయపడిపోయానని అందువల్లే పోలీసులకు చెప్పలేదని ఆమె వెల్లడించింది.
అయితే అంజలి మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడిపినట్లు నిధి ఆరోపించింది. ఈ ఆరోపణలను కుటుంబ సభ్యులు ఖండించారు. మరోవైపు మృతురాలి పోస్టుమార్టం నివేదికలోనూ అంజలి మద్యం సేవించినట్లు వెల్లడికాలేదు. దీంతో నిధిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా గతంలో ఓ డ్రగ్స్ కేసులో నిధి నిందితురాలిగా ఉందని పోలీసులు గుర్తించారు. తాజాగా అంజలి ఇంట్లో చోరి ఘటనతో ఢిల్లీ యువతి యాక్సిడెంట్ వెనుక మరో కోణం ఉండొచ్చనే అనుమానాలకు బలం చేకూరింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.