Begin typing your search above and press return to search.
కర్ణాటకలో.. యడియూరప్పదే అనధికార `రాజ్యం`
By: Tupaki Desk | 28 July 2021 8:22 AM GMTఔను! ఇప్పుడు ఇదే మాట అన్ని రాజకీయ పక్షాల్లోనూ వినిపిస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రిగా పదవిని వదు లుకున్న యడియూరప్ప.. పని అయిపోయిందని.. ఇక, ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసిపోయిందని.. అనుకునేవారికి పలువురు రాజకీయ పండితులు చెబుతున్న మాట ఇదే! ``యడియూరప్ప తప్పుకొన్నారు.. అంతే.. అంతా ఆయన హవానే కొనసాగుతుంది!``-అని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. ప్రస్తుతం ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన బసవరాజ బొమ్మై.. యడ్డి మంత్రివర్గంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
అంతేకాదు.. అసలు బొమ్మై.. నియామకమే.. యడ్డి కనుసన్నల్లో ఆయన అభీష్టం మేరకు బీజేపీ పెద్దలు చేశారు. కేవలం ఇతర రాష్ట్రాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు.. బీజేపీ పెట్టుకున్న వయో నిబంధన వంటి కొన్ని కీలక కారణాల నేపథ్యంలోనే యడియూరప్పను పక్కన పెట్టాల్సి వచ్చిందని.. అంతేతప్ప.. ఆయన ను పార్టీ వదులుకునే ప్రయత్నం ఎన్నడూ చేయదనేది.. బొమ్మై.. నియామకంతోనే బీజేపీ పెద్దలు స్పష్టం చేశారు. ఎందుకంటే.. బసవరాజ బొమ్మై.. అధిష్టానికి పెద్దగా పరిచయం లేని పేరనే చెప్పాలి. ఆయనను అధిష్టానికి పరిచయం చేయడం .. సహా.. తనవైపు నడిపించిన నాయకుడు యడియూరప్ప.
గతంలో యడియూరప్ప.. బీజేపీపై అవిశ్వాసం ప్రకటించినప్పుడు.. బొమ్మై.. యడ్డికి మద్దతు పలికారు. అంతేకాదు.. యడియూరప్ప మంత్రాగంలో బొమ్మై కీలకంగా వ్యవహరించారు. యడియూరప్ప మాటను జవదాటని నాయకుడిగా.. అత్యంత ఆప్తమిత్రుడిగా.. బొమ్మైకి పేరుంది. అలాంటి నాయకుడికి తన వారసుడిగా.. సీఎం సీటును దక్కించడంలో యడ్డి ఢిల్లీ పెద్దలను ఒప్పించడమేకాకుడా.. తన హవాను తగ్గిపోకుండా కాపాడుకోగలిగారు. తన కులానికే చెందిన బొమ్మై.. వంటివారు సీఎం సీటులో ఉంటే తప్ప.. తాను తెరవెనుక చక్రం తిప్పే పరిస్థితి లేదనేది.. యడ్డికి బాగా తెలుసు.
నిజానికి కేంద్ర మాజీ మంత్రి.. గౌడ సామాజికవ ర్గానికి చెందిన సదానంద గౌడ, వక్కలిగ వర్గానికి చెందిన సీటీ రవి, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రహ్లాద జోషి.. వంటివారు... సీఎం పోస్టు కోసం ..పెద్ద ఎత్తున మంతనాలు చేశారు. అయినప్పటికీ.. వారికి దక్కలేదంటే.. ఇక్కడ బీజేపీ అధిష్టానంకూడా యడియూర ప్పను వదులుకోలేక పోయిందనే వాదన వ్యక్తమవుతోంది. ఢిల్లీలో రెండు రోజులు మకాం వేసి.తాను దిగిపోయినా.. తన మాటే చెల్లుబాటయ్యేలా.. యడియూరప్ప.. అధిష్టానం పెద్దలను ఒప్పించుకోగలగ బట్టే.. ఇప్పుడు బొమ్మై.. నియామకం సాధ్యమైంది.
ఇక, పార్టీ పరంగా చూసుకున్నా... బీజేపీకి యడియూరప్ప వంటి నాయకుడు.. కర్ణాటకలో బూతద్దం పెట్టి వెతికినా.. కనిపించరు. వాగ్ఢాటి.. సెంటిమెంటును కురిపించడం.. అన్ని వర్గాలను తనవైపు తిప్పుకోవడం.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విజన్ ఉన్న నాయకుడిగా యడ్డికి మంచి పేరుంది. అయితే.. పార్టీలో మాత్రం తన వారికే పదవులు ఇస్తారని.. తన అనుకున్న వారికే అందలం ఎక్కిస్తారనే పేరున్నా.. పార్టీకి ఇప్పుడు.. ఇవన్నీ కాదు కావాల్సింది.. వచ్చే ఎన్నికల్లోనూ కర్ణాటకలో జెండా ఎగరేయడం. అంటే.. యడియూరప్పను మరింత జాగ్రత్తగా చూసుకోవడమే పార్టీ ముందున్న లక్ష్యాలు.
ఈ క్రమంలోనే యడియూరప్ప కూడా.. తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పడం లేదని.. కేవలం పక్కకు తప్పుకొంటున్నానని అన్నారు. ఇక, బొమ్మై నియామకంలోనూ ఆయన హస్తం ఉంది. సో.. ఈ పరిణామాలను గమనిస్తే.. యడియూరప్ప.. అధికారికంగా.. సీఎం పోస్టు నుంచి తప్పుకొన్నా.. అనధికారికంగా.. కర్ణాటకను నడిపించేది ఆయనే అంటున్నారు పరిశీలకులు. మరి దీనిని ప్రతిపక్షాలు ఏరకంగా చూస్తాయో చూడాలి.