Begin typing your search above and press return to search.
మోడీ మెచ్చిన ఇంజినీర్ పరువు తీసేశాడు
By: Tupaki Desk | 3 Dec 2016 3:49 PM GMTఅతను అలాంటి..ఇలాంటి యువకుడు కాదు. ఏకంగా బీజేపీ సర్కారు మెచ్చిన యువ ఇంజినీర్... ఈ ఇంజినీర్‌ను మెచ్చి కేంద్రం మేకిన్ ఇండియా అవార్డుతో సత్కరించింది. మరి ఇంతటి ప్రతిభాశాలికి ఈ చెడు బుద్ధి ఎలా కలిగింది..? ఎర్ర బుగ్గకారులో రూ.42లక్షలు తరలించటం వెనక వున్న పెద్దలెవరు? బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగిన నకిలీనోట్ల వెనుక హస్తం ఎవరిది... కేంద్రంలోని పెద్దలదా... లేక రాష్ట్రంలోని బడాబాబులదా... అభిషేక్ వర్మ అరెస్టుతో ఇప్పుడు చర్చంతా వీటి చుట్టే తిరుగుతోంది.
యువ ఇంజినీర్ - మేకిన్ ఇండియాలో వినూత్న ఉత్పత్తిని ఆవిష్కరించినందుకు అవార్డు పొందిన 21 ఏళ్ల అభిషేక్ వర్మ నకిలీ నోట్ల కేసులో పట్టుబడ్డారు. రూ. 42 లక్షల విలువైన రూ 2 వేల నకిలీ నోట్లతో వర్మ పోలీసులకు చిక్కడం సంచలనం రేపింది. పంజాబ్ లోని మొహాలీలో వీవీఐపీలు ఉపయోగించే ఎర్ర బుగ్గ కారులో నకిలీ కరెన్సీని తరలిస్తూ వర్మ బృందం పోలీసులకు దొరికిపోయింది. వర్మతో పాటు ఆయన సోదరుడు విశాఖ వర్మ, లూథియానాకు చెందిన ప్రాపర్టీ డీలర్ సుమన్ నాగ్ పాల్ ను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ కరెన్సీని పాత రూ 500 - రూ 1000 నోట్లకు బదులుగా 30 శాతం కమీషన్ తో వీరు మార్పిడి చేస్తున్నారని మొహాలీ ఎస్‌పీ పర్మీందర్ సింగ్ చెప్పారు. పరారీలో ఉన్న ఈ గ్యాంగ్ సభ్యులు మరో ఇద్దరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారని సింగ్ తెలిపారు. చండీగఢ్‌లోని వర్మ కార్యాలయంలోనే రూ. 2000 కరెన్సీ నోట్లను వీరు ముద్రిస్తున్నారని చెప్పారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్ల సీరియల్ నెంబర్లు అసలు నోట్లను పోలి ఉన్నాయని చెప్పారు.
ఇంతకీ మోడీ ఎందుకు అభినందించలేదో చెప్పనే లేదు కదా. అంధులు ఉపయోగించే కర్రలలో ఏర్పాటు చేయడానికి ఉపయోగపడే సెన్సర్లను అభినవ్ తయారుచేశాడు. కర్రకు ముందు ఏముందో అంధులు తెలుసుకోవడానికి వీలుంటుంది. గోతులు..రాళ్లు..ఇతరత్రా అడ్డం వస్తే ఈ సెన్సర్ గుర్తించి అలారం మోగిస్తుంది. ఆ ఆవిష్కరణ చేసినందుకు మోడీ ఇతడిని జాతీయ సైన్స్ కాంగ్రెస్ సభలో అభినందించారు. చండీగఢ్ లోని అతని కార్యాలయంలో ఇప్పుడు నకిలీ 2000 నోట్లను మాత్రమే తయారుచేస్తున్నాడని, సెన్సర్లు తయారుచేయట్లేదని పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/