Begin typing your search above and press return to search.
మునుగోడులో టీఆర్‌ఎస్ పేరు మీదే పోటీ.. ఎందుకంటే!
By: Tupaki Desk | 8 Oct 2022 4:33 PM GMTనవంబర్ 3న తెలంగాణలోని మునుగోడులో జరగనున్న ఉప ఎన్నిక అన్ని పార్టీల్లో కాక రేపుతున్న సంగతి తెలిసిందే. మునుగోడులో గెలిచి తమ సత్తా నిరూపించుకోవాలని అన్ని ప్రధాన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే తమ అభ్యర్థులను సైతం ప్రకటించాయి. ప్రచారంలోనూ జోరు పెంచాయి. విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్ర స్థాయిలో చోటు చేసుకుంటున్నాయి.
కాగా మునుగోడులో అధికార టీఆర్‌ఎస్ తర ఫున మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల టీఆర్‌ఎస్‌ను తెలంగాణ సీఎం, ఆ పార్టీ అధినేత కేసీఆర్.. బీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి)గా మార్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా, బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో ఉంటారా అనేదానిపై కొంత సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పష్టతనిచ్చారు.. మంత్రి జగదీష్‌రెడ్డి. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతను జగదీష్‌రెడ్డి చూస్తున్న సంగతి తెలిసిందే.
టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశామని.. అయితే ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు రాలేదని జగదీష్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థిగానే బరిలో ఉంటారని వెల్లడించారు.
కాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్వార్థం వల్లే మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి జగదీష్‌రెడ్డి ధ్వజమెత్తారు. మూడేళ్ళుగా బీజేపీతో టచ్‌లో ఉన్నానని చెప్పి బీజేపీలో చేరాడని విమర్శించారు. రూ.22 వేల కోట్ల కాంట్రాక్టుకు బీజేపీకి అమ్ముడుపోయాడని తీవ్ర ఆరోపణలు చేశారు. అమ్ముడుపోయిన వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా అని ప్రశ్నించారు. దొరికిన దొంగ రాజగోపాల్ రెడ్డి అని, అతని వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వివరించారు. రాజగోపాల్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ఆయా కారణాల వల్ల వచ్చాయని, కానీ మునుగోడులో ఏ కారణం వల్ల వచ్చిందని జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.