Begin typing your search above and press return to search.
ఏపీలో మరో ఘోరం.. పెళ్లికి నో చెప్పిందని కాల్చేశాడు
By: Tupaki Desk | 10 May 2022 4:06 AM GMTతాము కోరుకున్నది ఎట్టి పరిస్థితుల్లో సొంతం కావాలనే దరిద్రపుగొట్టు తరం ఒకటి తయారైంది. తమ ఇష్టమే కాదు.. ఎదుటోడి ఇష్టం కూడా అవసరమన్న కనీస ఇంగితాన్ని మరిచిపోయి.. తాలిబన్ల ఉన్మాదాన్ని పుణికి పుచ్చుకుంటున్న పిశాచులు ఈ మధ్యన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అవుతున్నారు. నెల్లూరు జిల్లాలో తాజాగా చోటు చేసుకున్న ఈ ఉదంతం చూస్తే.. షాక్ కు గురి కావాల్సిందే. పెద్ద చదువులు చదివి.. మంచి ఉద్యోగం చేస్తూన్న ఒక ఐటీ ఉద్యోగిలోని ఈ ఉన్మాదం భవిష్యత్తులో జరిగే ఎన్నో దారుణాలకు ఒక ఉదాహరణగా చెప్పక తప్పదు.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి అనే చిన్న గ్రామంలో చోటు చేసుకున్న ఈ దారుణం గురించి వింటే నోట మాట రాదు. ఎలాంటి తప్పు చేయని ఒక అమ్మాయి.. తనకు నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకోను అని చెప్పటమే పెద్ద పాపంగా మారి.. ఆమె ప్రాణాలు పోయేలా చేసింది. ప్రాణాలు తీసిన వ్యక్తి ఆమెకు బంధువే కావటం గమనార్హం. నెల్లూరుజిల్లా తాటిపర్తి అనే చిన్న గ్రామంలో చోటు చేసుకున్న ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది.అసలేం జరిగిందంటే..
35 ఏళ్ల సురేశ్ రెడ్డి.. 26 ఏళ్ల కావ్య ఇద్దరూ దూరపు బంధువులు. తాటిపర్తి గ్రామంలో వీరిద్దరి ఇళ్లు పక్క పక్క వీధుల్లోనే ఉన్నాయి. ఇద్దరివీ వ్యవసాయ కుటుంబాలు. వీరిద్దరూ ఐటీ ఉద్యోగులే. కావ్య ముంబయిలో పని చేస్తుంటే.. సురేశ్ బెంగళూరులో పని చేస్తుంటాడు. కరోనా కారణంగా లాక్ డౌన్ తదితరాల కారణంగా వారిద్దరు గ్రామంలో ఉండే వర్కు ఫ్రం హోం చేస్తున్నారు. మరదలి వరస అయ్యే కావ్యను తాను పెళ్లి చేసుకుంటానని.. సంబంధం మాట్లాడాలని సురేశ్ రెడ్డి ఏడాది క్రితం తన తల్లిదండ్రుల్ని కోరాడు.
అయితే.. పెళ్లికి కావ్య ఒప్పుకోలేదు. అయితే సురేశ్ మాత్రం వదలకుండా ఆమెకు తన ఇష్టాన్ని ఏడాదిగా తెలుపుతూనే ఉన్నా.. కావ్య మాత్రం అందుకు ససేమిరా అని తేల్చేసింది. తానెంత అడుగుతున్నా మనసు మార్చుకోని కావ్య తీరుపై సురేశ్ లో అగ్రహం పెరిగింది. ఫోన్ చేస్తూ తనను అదే పనిగా ఇబ్బంది పెడుతున్న సురేశ్ నెంబరు ను బ్లాక్ చేసింది. దీంతో.. ఆమెను అంతం చేయాలని డిసైడ్ అయ్యాడు.
ఎలా సంపాదించాడన్నది బయటకు రాలేదు కానీ అమెరికా తయారీ పిస్టల్ ను సంపాదించిన సురేశ్.. సోమవారం మధ్యాహ్నంఆమె ఇంటికి నడుచుకుంటూ వెళ్లాడు. బెడ్రూంలో ఉన్న కావ్య ఆఫీస్ పని చేసుకుంటూ ఉంది. నేరుగా ఆమె గదికి చేరుకున్న సురేశ్.. పిస్టల్ తీసి కావ్యను కాల్చాడు. అది కాస్తా గురి తప్పింది. పెద్ద శబ్దం రావటంతో అక్కడకు చేరుకున్న కావ్య సోదరి.. సురేశ్ ను అడ్డుకునే ప్రయత్నం చేసింది.
ఆమెను బలంగా తోసేసిన సురేశ్.. ఈసారి తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా.. కావ్యకు అత్యంత సమీపానికి వెళ్లి.. ఆమె జుట్టు పట్టుకొని అతి సమీపం నుంచి కాల్చేశాడు. కావ్య సోదరి కేకలతో కుటుంబ సభ్యయులు పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. ఈలోపు సురేశ్ అక్కడి నుంచి పారిపోయాడు. నెత్తుటి మడుగులో పడి ఉన్న కావ్యనుఆసుపత్రికి తరలించే వేళలోనే ఆమె కన్నుమూసింది. కావ్యను కాల్చిన తర్వాత సురేశ్ రెడ్డి పక్కనున్న స్కూల్ గోడ దూకి.. అక్కడే నిర్మాణం జరుగుతున్న దాబాలోకి వెళ్లి తనను తాను కాల్చుకొని మరణించాడు.
గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని సురేశ్..కావ్యను కాల్చి చంపటం షాకింగ్ గా మారితే.. అతడికి యూఎస్ మేడ్ పిస్టల్ ఎక్కడ నుంచి వచ్చింది? దాన్ని ఎలా సేకరించారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్న వ్యక్తి ఇంత ఉన్మాదంగా వ్యవహరించటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తనకు దక్కనిది ఎవరికి దక్కకుండా చేయటం కోసం ఇలాంటి ఉన్మాదానికి పాల్పడి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.