Begin typing your search above and press return to search.

సర్జికల్ స్ట్రైక్స్!... కాంగ్రెస్‌ కు బూమ‌రాంగ్ అయ్యాయే!

By:  Tupaki Desk   |   7 May 2019 1:35 PM GMT
సర్జికల్ స్ట్రైక్స్!... కాంగ్రెస్‌ కు బూమ‌రాంగ్ అయ్యాయే!
X
ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంది. ఓ వైపు బలీయంగా ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ఢీకొట్టేందుకోసం కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ నేల విడిచి సాము చేస్తున్నార‌నే చెప్పాలి. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్న రాహుల్ గాంధీ... ద‌క్షిణాదిపై మ‌రింత ప‌ట్టు సాధించేందుకు ఏకంగా కేర‌ళ‌లోని వాయ‌నాడ్ లో పోటీ చేస్తున్నారు. అయితే ఎన్ని చేసినా కూడా మోదీని ఢీకొట్ట‌డం ఆయ‌న‌కు సాధ్యం కావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో రాహుల్ కు అండ‌గా సీనియ‌ర్ నేత‌ - మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ రంగంలోకి దిగ‌క త‌ప్ప‌లేదు. మోదీని టార్గెట్ చేస్తూ రాహుల్ ను మంచి మ‌న్మోహ‌న్ సింగ్ మొన్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్థాన్ పై స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేసిన వైనాన్ని ఎన్నిక‌ల్లో ఆయుధంగా వాడుకుంటున్న మోదీకి చెక్ పెట్టేందుకు మ‌న్మోహ‌న్ భారీ సాహ‌స‌మే చేశార‌ని చెప్పాలి. అయితే ఆ సాహ‌సం కాస్తా... దుస్సాహ‌సంగా మారిపోయింద‌ని ఇప్పుడు తేలిపోయింది. మొత్తంగా మ‌న్మోహ‌న్ వ్యాఖ్య‌లు కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చ‌క‌పోగా... ఆ పార్టీకి బూమ‌రాంగ్ అయిపోయాయి.

అయినా మ‌న్మోహ‌న్ ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... *ఓ రెండు సార్లు స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేసిన దానికే ఇంత‌లా జ‌బ్బ‌లు చ‌రుచుకుంటున్నారు. మా హ‌యాంలో ఏకంగా ఆరు సార్లు పాక్ పై స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేశాం. మ‌రి మేమేమీ జ‌బ్బ‌లు చ‌రుచుకోలేదే. అయినా దేశ భ‌ద్ర‌త‌కు సంబంధించిన ఇలాంటి కీల‌క విష‌యాల‌ను ఎన్నిక‌ల్లో అస్త్రాలుగా వాడుకునే సంస్కృతికి మోదీనే తెర లేపి దేశ ప్ర‌తిష్ఠ‌ను మంట‌గ‌లుపుతున్నారు. ఇది ప‌ద్ధ‌తి కాదు* అంటూ మ‌న్మోహ‌న్ త‌న మౌన వ్ర‌తాన్ని వీడి మ‌రీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆరు సార్లు స‌ర్జిక‌ల్ దాడులు ఎప్పుడెప్పుడు చేశామ‌న్న విష‌యాన్ని కూడా ఆయ‌న వివ‌రించారు. అయితే ఇప్పుడు మ‌న్మోహ‌న్ మాట‌లు త‌ప్ప‌ని తేలిపోయాయి. కాంగ్రెస్ కు దెబ్బ ప‌డిపోయింది. మ‌న్మోమ‌న్ చెప్పిన‌ట్లుగా యూపీఏ హ‌యాంలో ఆరు సార్లు కాదు క‌దా...క‌నీసం ఒక్క‌సారి కూడా స‌ర్జిక‌ల్ దాడులు జ‌ర‌గలేద‌ని సాక్షాత్తు కేంద్ర ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ ఇప్పుడు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది.

ఈ విష‌యం ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్న విష‌యానికి వ‌స్తే... జమ్ముకశ్మీర్‌ కు చెందిన రోహిత్‌ చౌదరీ అనే వ్యక్తి 2004 నుంచి 2014 మధ్యలో... అంటే యూపీఏ హ‌యాంలో పాకిస్థాన్‌ పై జరిగిన మెరుపుదాడులకు సంబంధించిన వివరాలు అందించాల్సిందిగా ఆర్టీఐని ఆశ్రయించాడు. ఇందుకు సమాధానంగా ర‌క్ష‌ణ‌ శాఖ 2004 నుంచి 2014 మధ్యలో ఒక్క సారి కూడా మెరుపు దాడులు జరగలేదని పేర్కొంది. ప్రస్తుతం తమ దగ్గర 2016 - సెప్టెంబర్‌ లో యూరి సెక్టార్‌ లో జరిగిన మెరుపు దాడులకు సంబంధించిన రికార్డులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. ఈ వివ‌ర‌ణ‌తో మ‌న్మోహ‌న్ వ్యాఖ్య‌లు త‌ప్ప‌ని తేల‌గా... కాంగ్రెస్ కు మ‌రో భారీ దెబ్బ ప‌డిపోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది.