Begin typing your search above and press return to search.
తెలంగాణలో ఇదొక హోప్ - ఒక్కరోజే 1712 మంది డిశ్చార్
By: Tupaki Desk | 30 Jun 2020 5:00 PM GMTతెలంగాణ కరోనా బులిటెన్ వచ్చింది. యథావిధిగా సుమారు వెయ్యి కేసులు బయటపడ్డాయి. అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి నిన్న సుదీర్ఘ మీడియా సమావేశం పెట్టి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాదు.... రేపట్నుంచి చూస్కోండి మా ప్రతాపం..భారీగా టెస్టులు చేస్తాం అన్నారు. కట్ చేస్తే టెస్టులు సంఖ్య ఏం పెరగలేదు.
తాజాగా ఈరోజు విడుదల చేసిన బులిటెన్ ప్రకారం... గత 24 గంటల్లో 945 మందికి కరోనా పాజిటివ్ కేసులు బయట పడ్డాయి. దానికి రెట్టింపులో 1712 మంది డిశ్చార్జి కావడం ఆశాజనకమైన పరిణామం. ఇక ఈరోజు మొత్తం ఏడుగురు మరణించారు. జీహెచ్ఎంసీ, దాని పరిసర ప్రాంతాల్లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో 869 కేసులు నమోదు కాగా... రంగారెడ్డిలో 29, సంగారెడ్డిలో 21, మేడ్చల్‌లో 13 కేసులు నమోదయ్యాయి. అందుకే ఈ ప్రాంతాల్లో లాక్ డౌన్ కోసం కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు.
హైదరాబాద్ లో కరోనా వ్యాప్తిపై ప్రజలు ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. కేసీఆర్ లాక్ డౌన్ మాట ఎత్తగానే జనం సిటీ నుంచి పెద్ద ఎత్తున తరలిపోతున్నారు. ఇక సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ మంత్రి ఈటెల మాటలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ఈ సమయంలో బేషజాలకు పోవద్దని, హైదరాబాద్ లో కల్లోల పరిస్థితి ఉందని, కేంద్ర బృందానికి వాస్తవాలు తెలియనీయడం లేదని ఆరోపించారు.