Begin typing your search above and press return to search.

ఆ విషయం లో విశాఖ.. బెజవాడ సూపరట

By:  Tupaki Desk   |   13 Nov 2019 5:47 AM GMT
ఆ విషయం లో విశాఖ.. బెజవాడ సూపరట
X
నగరాల్లో బతకటం చాలా ఖరీదైన వ్యవహారమన్న విషయాన్ని ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరమే లేదు. నగర జీవితం అన్న వెంటనే ఖర్చుల గురించి ఆలోచిస్తుంటారు. మరి.. ఇలాంటి వేళ ఖర్చులు తక్కువ గా ఉండే నగరాలేవి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికిందో తాజా అధ్యయనం.ప్రపంచం లోని పలు నగరాల్ని లిస్ట్ చేసిన ఒక సంస్థ.. కొన్ని అంశాల్ని ప్రాతిపదిక గా తీసుకొని కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ గా ఉండే నగరాలు.. ఎక్కువగా ఉండే సిటీస్ ర్యాంకుల్ని తయారు చేసింది.

ప్రపంచం లోని 352 నగరాల్లోని ప్రజల జీవన వ్యయంపై నంబియో సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తి కర విషయాలు బయటకు వచ్చాయి. న్యూయార్క్ నగర జీవన వ్యయాన్ని ప్రాతి పదికగా తీసుకొని ఇతర నగరాల స్థాయిని డిసైడ్ చేశారు. ఈ నగరంలో నిత్యవసర వస్తువులు.. ఆభరణాల ధరలు.. రెస్టారెంట్ల లో ఉన్న రేట్లు.. రవాణా.. ఇతర అవసరాల ధరల్ని లెక్కించి న్యూయార్క్ నగర సూచీని వంద గా సెట్ చేవారు. అక్కడున్న ధరల్ని ఇతర నగరాల్లో ఉన్న ధరల తో పోల్చి ర్యాంకుల్ని సెట్ చేశారు.

ఇలా పోల్చిన వేళ.. ఏపీకి చెందిన విశాఖ.. విజయవాడ నగరా ల్లో జీవన వ్యయం చాలా తక్కువ గా తేలింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ లో ఏపీ లోని రెండు నగరాలు దేశం లోని మిగిలిన నగరాల్లో కంటే తక్కువ గా ఉండటం గమనార్హం. నివేదిక లో విజయవాడ కు 350 ర్యాంకు రాగా.. విశాఖపట్నంకు 351 ర్యాంకు వచ్చింది. అంటే.. విజయవాడతో పోలిస్తే.. విశాఖపట్నం లోనే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువన్న విషయం తాజా ర్యాంకింగ్ స్పష్టం చేసింది.

ఇక దేశం లోని వివిధ నగరాలకు ఇచ్చిన ర్యాంకులు చూస్తే.. ముంబయి 316.. ఢిల్లీ 323.. బెంగళూరు 327.. ఫూణె 328.. హైదరాబాద్ 333.. చెన్నై 334.. కోల్ కతాలు 336 ర్యాంకుల్లో నిలిచాయి. ప్రపంచం లో అత్యంత కాస్ట్ ఆఫ్ లివింగ్ నగరాల్లో స్విట్జర్లాండ్ లోని జ్యురిచ్.. బేసల్.. లాసన్నె.. జెనీవా.. బెర్న్ నగరాలు టాప్ ఫైవ్ లో నిలిచాయి.

ఆసక్తికరమైన మరో విషయం ఏమంటే.. కాస్ట్ ఆఫ్ లింగ్ తక్కువ గా ఉన్న బెజవాడ లో అద్దెలు మాత్రం భారీగా ఉంటాయని తాజా అధ్యయనం తేల్చింది. అద్దెల్లో విజయవాడ సూచీ 5.01 శాతం ఉండగా.. విశాఖ నగరం 4.07 మాత్రమే వచ్చింది. బెజవాడ లో అద్దెలు లక్నో.. సూరత్.. భోపాల్.. భువనేశ్వర్.. మైసూర్.. కోయంబత్తూర్.. జైపూర్ నగరాల కంటే ఎక్కువని తేల్చింది.