Begin typing your search above and press return to search.

ఆ విష‌యంలో వైసీపీ-టీడీపీ ఎత్తుల‌పై ఎత్తులు..!

By:  Tupaki Desk   |   17 July 2022 12:30 AM GMT
ఆ విష‌యంలో వైసీపీ-టీడీపీ ఎత్తుల‌పై ఎత్తులు..!
X
రాజ‌కీయాల్లో ఎత్తులు పైఎత్తులు మామూలే. వ్యూహ ప్ర‌తివ్యూహాలు కూడా కామ‌నే. అయితే.. కొన్ని కొన్ని సార్లు.. ఈ వ్యూహ ప్ర‌తివ్యూహాలు చిత్రంగా ఉంటాయి. ప్ర‌ధానంగా ఏపీలో రెండు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య తెర‌మీద‌కి వ‌చ్చిన‌.. వ్యూహ ప్ర‌తివ్యూహాలు ఆస‌క్తిగా ఉన్నాయి.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ.. అధికార పార్టీ వైసీపీలు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఢీ అంటే.. ఢీ అనేలా.. ఓ రేంజ్‌లో త‌ల‌ప‌డుతున్నాయి. అధికారం త‌మ‌దంటే త‌మ‌దేనని ఇప్ప‌టి నుంచే చెబుతున్నాయి.

ఈ క్ర‌మంలో ఈ రెండు పార్టీలు కూడా చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నాయి. ఎలాగంటే.. ముం దుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాలా? వ‌ద్దా..? అనేది ఒక విష‌యం అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాంటి మేనిఫెస్టోను ప్ర‌క‌టించాల‌నే విష‌యంపై రెండు పార్టీల్లోనూ పోటీ నెల‌కొంది. వైసీపీని చూసి.. తాము మేనిఫెస్టోను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంటుంద‌ని.. తాజాగా మాజీ మంత్రి టీడీపీ సీనియ‌ర్ నేత ఒక‌రు మీడియా మిత్రుల‌కు చూచాయ‌గా చెప్పారు.

అయితే.. వైసీపీ మాత్రం.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో అమ‌లు చేస్తున్న మేనిఫెస్టోలో కొన్ని మార్చే అవ‌కాశం ఉంటుంద‌ని.. ముఖ్యంగా ఆర్థికంపై ప్ర‌భుత్వంపై భారంగా మారిన ప‌థ‌కాలు కొన్నింటిని ప‌క్క‌న పెట్టే సూచ‌న‌లు ఉన్నాయ‌ని.. టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ మేనిఫెస్టోను చూసిన త‌ర్వాత‌.. తాము నిర్ణ‌యం తీసుకుంటామ‌ని.. అంటున్నారు. మ‌రోవైపు.. వైసీపీ నాయ‌కులు మాత్రం.. త‌మ మేనిఫెస్టోను ఇప్పుడే.. ప్ర‌క‌టించేది లేద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు చాలానే స‌మ‌యం ఉంద‌ని అంటున్నారు.

ఇక‌, అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌కు సంబంధించిన విష‌యాలు గ‌మ‌నిస్తే.. టీడీపీ ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. తాము ప్ర‌క‌టించాల‌ని.. వైసీపీ భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల టీడీపీ ప్ర‌క‌టించిన త‌ర్వాతే.. సీమ‌లోని కొన్నినియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన‌ట్టు నాయ‌కులు చెబుతున్నారు.

ఇక‌, కోస్తా.. ఉత్త‌రాంధ్ర విష‌యాల్లో మాత్రం వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసినా.. చేయ‌క‌పోయినా.. ఇప్పుడున్న నాయ‌కులు దాదాపు కొన‌సాగే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. ఎందుకంటే. ఇక్క‌డ టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కులు ఉండ‌డ‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది. ఏదేమైనా.. రెండు పార్టీల మ‌ధ్య వ్యూహ ప్ర‌తివ్యూహాలు జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.