Begin typing your search above and press return to search.

1960 లో పాక్ చాలా అద్భుత దేశం ...భారత్ ని తరచుగా క్రికెట్లో ఓడించే వాళ్లం !

By:  Tupaki Desk   |   24 Jan 2020 9:42 AM GMT
1960 లో పాక్ చాలా అద్భుత దేశం ...భారత్ ని తరచుగా క్రికెట్లో  ఓడించే వాళ్లం !
X
మనల్ని మనం గొప్పగా చెప్పుకోవడానికి , ఇతరులకి మనం గొప్ప వాళ్ళం అని చూపించుకోవడానికి ఇతరులని తక్కువ చేస్తూ మాట్లాడటం సాధారణ విషయమే. కానీ , ఆలా మనమే గొప్ప అని చెప్పుకునే ముందు ...కొంచెం వెనుకా , ముందు ఆలోచించుకోవాలి లేకపోతే అందరి మధ్యలో అభాసుపాలు కావడం ఖాయం. కానీ , ఆలా నలుగురిలో నవ్వులు పాలు అవ్వడం ఖాయం అని తెలిసినప్పటికీ కూడా కొందరు తమ గురించి గొప్పలు చెప్తుంటారు. అలాంటివారిలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒకరు.

దావోస్‌లో అంతర్జాతీయ ఆర్థిక సదస్సు లో మాట్లాడిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తమకన్నా ఏడు రెట్లు పెద్దదైన భారత్‌ ను క్రికెట్లో తాము నిరంతరం ఓడిస్తుండే వాళ్లమని చెప్పుకున్నారు. మరి టీమిండియా చేతిలో చవిచూసిన ఘోర పరాజయాలను మాత్రం చెప్పలేదు పాపం. అలాగే అప్పట్లో హాకీ, ఇతర క్రీడలలో పాక్‌ అద్భుతంగా రాణిస్తుండేదని తెలిపారు. అప్పట్లో ఓడిన జట్టుకు ఏ బహుమతి ఇచ్చేవారు కాదని, కనీసం సానుభూతి చూపేవారు కాదని ఇమ్రాన్‌ అన్నారు. తాను రాజకీయాల్లోకి రాగానే కొందరు నవ్వారని..కానీ తానెప్పుడు లక్ష్యాన్ని వదిలిపెట్టలేదన్నారు.

అలాగే ఇమ్రాన్ ఖాన్ ఇంకా మాట్లాడుతూ .. 1960లో పాకిస్తాన్‌ చాలా అద్భుత దేశం. ఆసియా దేశాలకు ఆదర్శంగా నిలిచేది. నేను అదే ఆశతో పెరిగాను. కానీ.. దురదృష్టవశాత్తు దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయారు. ప్రజాస్వామ్యం గతి తప్పడంతో.. సైన్యం రంగప్రవేశం చేసింది. పాకిస్థాన్‌ పితామహులు తెలివిగా పనిచేశారు. మానవత్వం, సామాజిక న్యాయం కోరుకున్నారు. కానీ.. అది పక్కదారి పట్టింది. దేశం లో మంచి పరిపాలన అందించ గలిగితే పాకిస్తాన్‌ అభివృద్ధి చెందడం ఖాయం అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.