Begin typing your search above and press return to search.

కరోనా వేళ.. ఊహించని ఘనత సాధించిన అంబానీ

By:  Tupaki Desk   |   6 Aug 2020 3:45 AM GMT
కరోనా వేళ.. ఊహించని ఘనత సాధించిన అంబానీ
X
వ్యాపార రంగంలో.. అందునా కార్పొరేట్ ప్రపంచంలో వరుస విజయాలు.. సంచలనాలు సాధించటం అంత తేలికనైన విషయం కాదు. కంటికి ఏ మాత్రం కనిపించని లాబీలు భారీగా ఉంటాయి. వీరు విసిరే సవాళ్లను తట్టుకొని ముందుకెళ్లటం.. మిగిలిన వారిని తోసి రాజని అగ్రస్థానానికి చేరటం అంత తేలికైనది కాదు. అందునా కరోనా లాంటి సంక్షోభ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటం గొప్ప విషయమే. ఆ అరుదైన మేజిక్ ను వాస్తవంగా మార్చారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.

ఇటీవల కాలంలో ఆయన వరుస పెట్టి విజయాలు సాధిస్తున్నారు. అలాంటి ఆయన తాజాగా మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచంలో రెండో అతి పెద్ద బ్రాండుగా రిలయన్స్ నిలిచింది. ప్రస్తుత సంవత్సరంలో ఫ్యూచర్ బ్రాండు రూపొంచిందిన సూచీలో యాపిల్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకోగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది.

ఈ ఇండెక్స్ లో తొలిసారి చోటు సాధించిన రిలయన్స్ అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించినట్లు చెబుతున్నారు. వినూత్న ఉత్పత్తులు.. వినియోగదారులకు అత్యుత్తమ సేవల కలబోతగా రిలయన్స్ ముందుకు సాగుతోంది. భారతీయులందరికి ఒకే చోట అన్ని దొరికేలా సంస్థను తీర్చిదిద్దటంలో రిలయన్స్ విజయంగా అభివర్ణించారు.

ఇంధనం..పెట్రో రసాయనాలు.. జౌళి.. సహజవనరులు.. రిటైల్.. టెలికమ్యునికేషన్స్.. ఇలా ఎన్నో రంగాల్లో రిలయన్స్ అడుగు పెట్టిందని.. ఫేస్ బుక్.. గూగుల్.. లాంటి సంస్థలు ఇందులో వాటాలు తీసుకోవటాన్ని ప్రస్తావించింది. ఈ ఇండెక్స్ లో మూడో స్థానంలో శామ్ సంగ్ నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఎన్ విడియూ.. మౌటాయ్.. నైక్.. మైక్రోసాఫ్ట్.. ఎఎస్ఎమ్ ఎల్.. పేపాల్.. నెట్ ఫ్లిక్స్ లుచోటు సంపాదించాయి. తాజాగా విడుదల చేసిన ఇండెక్స్ లో టాప్ 20 బ్రాండుల్లో ఈసారి కొత్తగా అడుగు పెట్టినవి ఏడు కాగా.. అందులో రిలయన్స్ ఏకంగా రెండో స్థానాన్ని సొంతం చేసుకోవటం విశేషం.