Begin typing your search above and press return to search.
చివరికి.. బందరు పోర్టు నిర్మాణం ఆ కంపెనీకే!
By: Tupaki Desk | 1 Nov 2022 5:54 AM GMTకృష్ణా జిల్లాలో అనేక మలుపులు తిరుగుతూ వస్తున్న బందరు పోర్టు నిర్మాణ కాంట్రాక్టు చివరికి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మెయిల్)కు దక్కింది.
కీలకమైన కృష్ణా జిల్లాలో ఆ జిల్లా ముఖ్యపట్టణమైన బందరు బంగాళాఖాతం తీరంలో ఉంది. ఎప్పటి నుంచో బందరు పోర్టును నిర్మించాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. బందరు పోర్టు నిర్మాణం పూర్తయితే విదేశాలకు ఆక్వా ఎగుమతులతోపాటు బియ్యం ఎగుమతులు, వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయని.. భారీ ఎత్తున విదేశీ మారక ద్రవ్యం లభిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం బందరు పోర్టుకు శంకుస్థాపన చేసింది. దీన్ని నిర్మించడానికి సత్యం రామలింగరాజుకు చెందిన మైటాస్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు బ్యాంకుల నుంచి రూ.100 కోట్లు ప్రాథమికంగా రుణాలు కూడా తీసుకుంది. అయితే 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మికంగా మరణించడం, సత్యం రామలింగరాజు సత్యం కంప్యూటర్స్ అవకతవకలకు సంబంధించి జైలుపాలు కావడం వంటి కారణాలతో బందరు పోర్టు నిర్మాణ ప్రక్రియకు ఆదిలోనే ఇబ్బందులు తలెత్తాయి.
ఇక గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బందరు పోర్టు నిర్మాణ పనులను నవయుగ కంపెనీకి అప్పగించారు. కొంత మేరకు పనులు మొదలు పెట్టింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నవయుగ.. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు వియ్యంకుడుకి సంబంధించిన కంపెనీ అని.. ఈ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడంలో పలు అవకతవకలు జరిగాయని జగన్ ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తింది. నవయుగ కాంట్రాక్టును రద్దు చేసింది. దీనిపై నవయుగ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది.
ఇటీవల కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం పోర్టు నిర్మాణానికి పలుమార్లు టెండర్లు పిలిచింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మెయిల్) కాంట్రాక్టును దక్కించుకుంది.
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు పలు ప్రాజెక్టులు మెయిల్ చేతిలో ఉన్నాయి. వేగంగా తక్కువ సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తుందని ఈ కంపెనీ మొదట్లో పేరు తెచ్చుకుంది. అయితే పోలవరం ప్రాజెక్టును మాత్రం నిర్దేశిత గడువులోగా పూర్తి చేయలేకపోయింది. ప్రస్తుతం పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో కూడా చెప్పలేని పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బందరు పోర్టు నిర్మాణం కూడా మెయిల్‌కు అప్పగించడంతో దీనిపైనా నీలినీడలు కమ్ముకున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.