Begin typing your search above and press return to search.
అతి పెద్ద ముస్లిం దేశంలో.. హిందూ దేవుడితో కరెన్సీ
By: Tupaki Desk | 18 Sep 2022 3:30 AM GMTఇండోనేషియా ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశం. అంతేకాదు.. అతిపెద్ద దీవుల దేశం (ఆర్చిపెలాగో) కూడా. ఇండోనేషియాలో ప్రజలంతా ఇస్లాం సంప్రదాయాలనే పాటిస్తారు. అల్లాను ఆరాధిస్తారు. ఇటీవల బీజేపీ వివాదాస్పద నేత నుపుర్ శర్మ చేసిన మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో ఆ దేశంలోనూ నిరసనలు చెలరేగాయి. అయితే ఇదంతా ఒక పార్శ్వం.
మరో పార్శ్వమేమిటంటే.. ఇండోనేషియా ఒక ఆసియా ఖండ దేశం. టూరిజమే ప్రధాన ఆదాయ వనరు. ఈ దేశాన్ని సందర్శించేవారిలో భారతీయులే అత్యధికం. సింగపూర్, మలేషియా, ఇండోనేషియా పక్కపక్కనే ఉండే దేశాలు. టూర్ ఆపరేటర్లు కూడా ఈ మూడు దేశాలను కవర్ చేస్తూ తక్కువ ఖర్చుకే టూర్ ప్యాకేజీలను అందిస్తున్నారు. దీంతో ఎన్నో వందల దీవులతో కూడిన ద్వీపాల దేశమైన ఇండోనేషియాను సందర్శించే భారతీయుల సంఖ్య ఎక్కువే. అక్కడి బాలి ద్వీపం ప్రపంచ ప్రసిద్ధి చెందిన టూరిస్ట్ స్పాట్ కూడా.
అయితే గత రెండేళ్లుగా కరోనా సృష్టించిన విలయంతో పర్యాటకుల సంఖ్య ఆగిపోవడంతో ఇండోనేషియా మిగతా దేశాల మాదిరిగానే ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోయిన సమయంలో.. అక్కడి ఆర్థిక నిపుణుల సలహా మేరకు ఇండోనేషియా ప్రభుత్వం 20 వేల నోటుపై వినాయకుడి (గణేశుడు) బొమ్మను ముద్రించింది. అప్పటి నుంచి క్రమంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందట. ఈ విషయాన్ని అక్కడి ప్రజలు చాలా బలంగా విశ్వసిస్తున్నారు. ఎప్పుడైతే తమ కరెన్సీ నోట్లపైన వినాయకుడిని ముద్రించారో.. అప్పటి నుంచో తమ దేశ ఆర్థిక వ్యవస్థ గాడినపడిందని ప్రభుత్వం కూడా నమ్ముతోంది.
ముందే చెప్పుకున్నట్టు ఇండోనేషియా.. ఒక ముస్లిం దేశం. కానీ ఆ దేశ కరెన్సీపై హిందువుల దైవం.. వినాయకుడి బొమ్మ ముద్రించడం వల్ల.. తమ దేశానికి పెద్ద మేలే జరిగిందని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు.
కాగా ఇండోనేషియా జనాభాలో దాదాపు 87.5శాతం మంది ప్రజలు ముస్లింలే. హిందువుల సంఖ్య కేవలం మూడు శాతమే. హిందువులు ఆ దేశంలో మైనారిటీలుగా ఉన్నారు. ప్రభుత్వంతో సహా ప్రజలు అంతా ఇస్లాం అవలంబీకులే. అయినప్పటికీ తమ 20000 నోటుపై హిందూ దేవుడైన వినాయకుడిని ముద్రించడం విశేషం. కాగా ఇండోనేషియా ప్రజలు ఎక్కువ మంది ముస్లింలే అయినప్పటికీ వినాయకుడిని చదువుల దేవుడిగా నమ్ముతుండటం విశేషం.
కాగా మన కరెన్సీ రూపాయి మాదిరిగానే ఇండోనేషియా కరెన్సీని రూపయ్య అంటారు. 20 వేల రూపయ్య నోటుపై ఒక వైపున వినాయకుడి బొమ్మను ముద్రించారు. వినాయకుడి పక్కనే ఇండోనేషియా మొదటి విద్యాశాఖ మంత్రి ఫొటో కూడా ఉంటుంది. నోటుకు మరో పక్కన ఉపాధ్యాయుడు, విద్యార్థులతో కూడిన చిత్రాన్ని ముద్రించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.