Begin typing your search above and press return to search.

అర్ధరాత్రి ప్రియుడి ‘సాహసం’ బెడిసి కొట్టింది.. అయితేనేం ‘జాక్ పాట్’ కొట్టాడు..!

By:  Tupaki Desk   |   13 Dec 2022 1:30 AM GMT
అర్ధరాత్రి ప్రియుడి ‘సాహసం’ బెడిసి కొట్టింది.. అయితేనేం ‘జాక్ పాట్’ కొట్టాడు..!
X
ఈ పెద్దోళ్లు ఉన్నారే... చిన్నవాళ్ళ ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోరని హీరో ఉదయ్ కిరణ్ చెప్పిన డైలాగ్ అప్పట్లో ఎంతో ఫేమస్ అయింది. నిజంగా ప్రేమికుల మనస్సును పెద్దవాళ్లు ఒప్పుకోరని చాలాసార్లు నిరూపితమైంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రేమికులకు పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంటుంది. తాజాగా ఓ లవ్ స్టోరీ నెట్టింట్లో వైరల్ గా మారింది.

బీహార్ కు చెందిన ఇద్దరు ప్రేమికులు నాలుగేళ్లు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన ప్రేయసి కావాలని ప్రియుడు అనుకున్నాడు. అర్ధరాత్రి అయిన లెక్క చేయకుండా ప్రేయసి ఇంటికి వెళ్లి యువతి కుటుంబ సభ్యులు అడ్డంగా బుక్కయ్యాడు. అయితే చివరికి మాత్రం ఆ ప్రేమికుడు అనుకున్నది సాధించి తన లవ్ స్టోరీకి శుభం కార్డు వేయడంతో అతడికి జాక్ పాట్ తగిలినట్లయింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలోని మోతిరాజ్ పూర్ కు చెందిన మున్నా రాజ్ అనే వ్యక్తి ఒక యువతిని ప్రేమించాడు. గత నాలుగేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోంది. ఈ క్రమంలోనే మున్నారాజ్ తన ప్రేయసి చూసేందుకు అర్ధరాత్రి తన ఇంటికి వెళ్లాడు. అయితే ప్రేయసి గదిని కనుక్కోవడంలో మాత్రం విఫలం చెందాడు.

అయితే రాత్రివేళ ఇంట్లో పెద్ద శబ్దాలు రావడంతో యువతి కుటుంబ సభ్యులు లేచి చూశారు. ఆ సమయంలో మున్నా రాజ్ వారి కంట పడటంతో అతడిని పట్టుకునేందుకు వారంతా ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో మున్నా రాజ్ సమీపంలోని బావిలోకి దూకాడు. అతడిని బయటకు తీసేందుకు యువతి కుటుంబ సభ్యులు ప్రయత్నించారు.

మున్నా రాజ్ మాత్రం తనకు తన ప్రేయసిని ఇచ్చి పెళ్లి చేస్తానని హామీ ఇస్తేనే బావిలో నుంచి పైకి వస్తానని షరతు విధించాడు. దీంతో ఎలాగైనా అతడిని ఒప్పించి మున్నారాజ్ ను బావి నుంచి బయటికి తీసుకొచ్చారు. అనంతరం ఈ సంఘటనపై పెద్ద మనుషులు పంచాయితీ పెట్టారు. ఆ తర్వాత ఆ యువకుడు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేశారు.

అయితే ఈ పెళ్లికి యువకుడు కుటుంబ సభ్యులు మాత్రం హాజరు కాలేదని సమాచారం. ఏది ఏమైనా ఎరక్కపోయి బావిలో ఇరుక్కుపోయిన ప్రేమికుడు చివరకు తన ప్రేయసిని అనుహ్యంగా దక్కించుకోవడం విశేషం. దీంతో వీరిద్దరి లవ్ స్టోరీ నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనిపై మీ రియాక్షన్ ఏంటో కింద మాతో పంచుకోండి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.