Begin typing your search above and press return to search.

ఇరాన్ జైల్లో క్రూరత్వం.. విచారణ పేరుతో సెక్స్ సంబంధాలపై ఆరా..!

By:  Tupaki Desk   |   11 Jan 2023 11:32 AM GMT
ఇరాన్ జైల్లో క్రూరత్వం.. విచారణ పేరుతో సెక్స్ సంబంధాలపై ఆరా..!
X
ఉద్యమకారులను ఇరాన్ జైల్లో అధికారులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్న విషయాన్ని ప్రముఖ ఉద్యమకారిణి సెపిడె కోలియన్ బయటపెట్టాడు. జైలు నుంచి ఆమె రాసిన ఉత్తరం ద్వారా ఖైదీలను అధికారులు ఎలాంటి చిత్ర హింసలకు గురి చేస్తున్నారు? నేరాంగీకారానికి ఎలాంటి ఒత్తిడి చేస్తున్నారనే విషయాలను ఆమె బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేసి చేశారు.

2018లో ఇరాన్‌లోని ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లోని ఒక చక్కెర కర్మాగారంలో కార్మికుల సమ్మెకు సెపిడే మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో తనపై జరిగిన ఇంటరాగేషన్.. బలవంతపు ఒప్పుకోలు ఘటనలకు సంబంధించిన పలు విషయాలను ఆమె తన ప్రస్తావించారు.

తనను విచారించించిన ఒక మహిళా అధికారి రావడంతో మగవాళ్ల విచారణ కన్నా దారుణంగా వేధింపులు ఉండకపోవచ్చని భావించానని తెలిపింది. కనీసం లైంగిక దాడులైనా ఉండవని అనుకోగా తన ఆశలు అడియాశ లైనట్లు వాపోయింది. ఆ మహిళా అధికారి టేబుల్‌ను కాలితో గట్టిగా తన్ని తనను కమ్యూనిస్ట్ వేశ్యా.. ఎవరితో పడుకున్నావు చెప్పు అంటూ అరించిందని గుర్తు చేసుకుంది.

సదరు మహిళా విచారణ అధికారి తన కళ్లకు కట్టిన గంతలు తొలగించారని పేర్కొంది. ఆ తర్వాత కెమెరా ఆన్ చేసి తన లైంగిక సంబంధాల గురించి చెప్పమని అడిగినట్లు లేఖలో ఆరోపించింది. అయితే ఇందుకు తాను నిరాకరించానని కోలియన్ చెప్పింది. గంటల తరబడి విచారణ తర్వాత తనను టాయిలెట్‌కి తీసుకెళ్లమని వేడుకున్నట్లు పేర్కొంది.

లేడీస్ టాయిలెట్ దగ్గరకు తీసుకెళ్లిన ఆమె తనను అందులో నెట్టి బయట గొళ్లెం పెట్టారని వాపోయింది. టాయిలెట్లో బందీ అయిన తనకు ఇంటరాగేషన్ రూమ్‌లో ఓ వ్యక్తిని హింసిస్తున్నట్లు.. కొరడాతో కొడుతున్నట్లు పెద్ద అరుపులు.. శబ్ధాలు వినిపించాయని లేఖలో ప్రస్తావించింది. హింస తాలూకు శబ్దాలు కొన్ని గంటలపాటు ఒక రోజంతా కొనసాగినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.

టాయిలెట్ నుంచి విడుదలైన తర్వాత మూడ్రోజుల పాటు నిద్ర కూడా లేని తనను కెమెరా ఉన్న గదికి తీసుకెళ్లినట్లు పేర్కొంది. అప్పుడు తాను సగం స్పృహలోనే ఉన్నానని.. తన నుంచి స్క్రిప్ట్ తీసుకొని కెమెరా ముందు కూర్చుని చదివానని ఆమె రాశారు. ఈ ఒప్పుకోలు కారణంగా తనకు ఐదేళ్ల జైలు శిక్ష పడిందని వాపోయింది.

ఇరాన్ జైలులో చాలామంది ఖైదీలను ఇలా బలవంతంగా నేరాలు అంగీకరించేలా చేస్తున్నారని తెలిపింది. నేరాలు అంగీకరించకపోతే చిత్రహింసలకు గురి చేస్తున్నారని.. అధికారులే ఖైదీలపై దాడులు చేసి తిరిగి వారే కోర్టులను ఆశ్రయిస్తున్నారని వివరించింది. ప్రస్తుతం ఇరాన్‌లో జరుగుతున్న నిరసనలను విప్లవంగా అభివర్ణిస్తూ లేఖలో పేర్కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.