Begin typing your search above and press return to search.

మూడో వేవ్ లో పిల్లలకు ఇలాంటి సమస్యలు వస్తాయట

By:  Tupaki Desk   |   8 Jun 2021 4:31 AM GMT
మూడో వేవ్ లో పిల్లలకు ఇలాంటి సమస్యలు వస్తాయట
X
కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే బలహీనమవుతున్న వేళ.. ఇప్పుడు అందరి చూపంతా మూడో వేవ్ మీదనే ఉంది. వాస్తవానికి మొదటి వేవ్ పూర్తి అయిన వెంటనే.. రెండో వేవ్ గురించి ఎవరూ పెద్దగా ఆలోచించలేదు. కరోనాపై విజయం సాధించామన్న అత్యుత్సాహం.. ముంచుకొస్తున్న ముప్పును గుర్తించే విషయంలో అటు ప్రభుత్వాలు.. ఇటు ప్రజలు విఫలమయ్యాయి. సెకండ్ వేవ్ షాక్ తో మూడో వేవ్ విషయంలో ప్రజల్లో అప్రమత్తత పెరిగింది. ప్రభుత్వాలు సైతం.. మూడో వేవ్ కు సంబంధించిన చర్యల్ని షురూ చేసింది.

కొవిడ్ వైరస్ స్పైక్ ప్రొటీన్ ఎప్పటికప్పుడు మార్చుకోవటంతో రకరకాల స్ట్రెయిన్లు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కరోనా మూడో వేవ్ పై వరంగల్ లోని నిట్ (నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) అధ్యయనం చేస్తోంది. మరి.. తీవ్రత ఎలా ఉండనుంది? ఎలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి? అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

మొదటి దశతో పోలిస్తే.. రెండో దశలో తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. మూడో వేవ్ లో మరింత ముప్పు ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. వైరస్ పలు రూపాంతరాలతో హైబ్రిడ్ వేరియంట్ గా మారు ప్రమాదం ఉందంటున్నారు. మూడో వేవ్ లో పిల్లల్లో శరీరం మీద దద్దుర్లు.. కళ్ల కింద మంటలు.. శ్వాస తీసుకోవటంలో ిబ్బంది.. జలుబు లక్షణాలు ఉండే అవకాశం ఉందంటున్నారు.

రాబోయే రోజుల్లో వర్షాకాలం కావటంతో పిల్లల్లో ఎక్కువగా జలుబు.. దగ్గు.. డయేరియా బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు. వీలైనంతవరకు పిల్లల్నిబయటకు పంపకుండాజాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. మూడో వేవ్ లో వచ్చే లక్షణాలుగా చెబుతున్న వాటిల్లో ఏ సమస్య ఎదురైనా వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లి.. సలహాలు తీసుకోవాలని చెబుతున్నారు.