Begin typing your search above and press return to search.

కరోనా చికిత్సలో.. రెమ్ డెసివ‌ర్ వాడొద్దుః డ‌బ్ల్యూహెచ్‌వో

By:  Tupaki Desk   |   20 May 2021 4:30 PM GMT
కరోనా చికిత్సలో.. రెమ్ డెసివ‌ర్ వాడొద్దుః డ‌బ్ల్యూహెచ్‌వో
X
క‌రోనా గురించిన చ‌ర్చ జ‌రిగిన ప్ర‌తిసారీ తెర‌పైకి వ‌చ్చే స‌మ‌స్య‌ల్లో రెమ్ డెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ ప్ర‌ధానంగా ఉంటోంది. ఈ మందు ల‌భ్యంకావ‌ట్లేద‌ని కొవిడ్ రోగులు, వారి కుటుంబ స‌భ్యులు అల్లాడి పోతున్నారు. ఈ మందును శ్వాస స‌మ‌స్య అధికంగా ఉన్న‌వారికి ఇస్తున్నారు. కొవిడ్ బాధితుల‌కు మొత్తం 6 డోసులు ఇస్తున్నారు. దీంతో.. క‌రోనా చికిత్స‌లో ఈ మందు కీల‌కంగా మారిపోయింది.

ఫ‌లితంగా.. రెమ్ డెసివ‌ర్ కొర‌త ఎక్కువైపోయింది. ఇదే అదునుగా బ్లాక్ మార్కెట్ దందా పెరిగిపోయింది. సాధార‌ణంగా 2 నుంచి 3 వేలకు దొరికే ఈ మందును.. ఏకంగా 30 వేల నుంచి 40 వేల‌కు పెంచి అమ్మేస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. దేశ‌వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

క‌రోనా చికిత్స‌లో ఈ మందును వాడొద్ద‌ని ప్ర‌క‌టించింది. ఈ మందు ద్వారా క‌రోనా త‌గ్గుతున్న‌ట్టు ఆధారాలు లేవ‌ని స్ప‌ష్టం చేసింది. ఇక‌, భార‌త్ లో క‌రోనా చికిత్స ఉప‌యోగిస్తున్న ఈ మందుపైనా త‌మ‌కు అనుమానాలు ఉన్నాయ‌ని చెప్పింది. అందువ‌ల్ల క‌రోనా చికిత్స నుంచి ఈ మందును బ్యాన్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.