Begin typing your search above and press return to search.

టీవీ చూసినా, పాటలు విన్నా శిక్ష, జరిమానా

By:  Tupaki Desk   |   21 Aug 2020 5:10 PM GMT
టీవీ చూసినా, పాటలు విన్నా శిక్ష, జరిమానా
X
దేశం ఓవైపు అంతరిక్షం వైపు అడుగులు వేస్తుంటే.. మరోవైపు గ్రామాల్లో ఇంకా మూఢ నమ్మకాలతో ప్రజలను బానిసలుగా మార్చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పశ్చిమబెంగాల్ లో అలాంటి దారుణమైన ఫత్వా ఒకటి వెలుగుచూసింది.

ముర్షిదాబాద్ జిల్లాలోని మైనారిటీలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో తాజాగా టీవీ చూసినా.. క్యారమ్ ఆడినా, మద్యం, లాటరీ టికెట్లు కొన్నా.. సెల్ ఫోన్లు, కంప్యూటర్లలో పాటలు వినడం వంటి వాటిపై నిషేధం విధించారు. ఆగస్టు 9న ఈ మేరకు మతపెద్దల కమిటీ ఫత్వా జారీ చేసింది.

నిబంధనలు అతిక్రమించిన వారికి చెవులు పట్టుకొని క్షమాపణలు చెప్పడం.. గుండు గీయించడం.. గుంజిల్లు తీయించడంతోపాటు రూ.500 నుంచి రూ.7000 వరకు జరిమానాలు విధించినున్నట్లు ఆ ఫత్వాలో పేర్కొన్నారు. ఇక నిబంధనలు ఉల్లంఘించిన వారి గురించి తెలియజేసిన వారికి రూ.2వేల వరకు రివార్డ్ ను ప్రకటించారు.

యువతరం నైతిక, సాంస్కృతిక పద్ధతులను తప్పి చెడు అలవాట్లకు బానిస కాకుండా వాటిపై నిషేధం విధించినట్టు కమిటీ చెప్పుకొస్తోంది. కానీ దీనిపై స్వచ్ఛంద సంఘాలు, యువకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.