Begin typing your search above and press return to search.
అమెరికా ప్రముఖుడి మాటతో.. హైదరాబాదీ వ్యాక్సిన్ రేంజ్ ఆకాశానికే హద్దు
By: Tupaki Desk | 29 April 2021 12:30 AM GMTదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లలో.. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు ఊహించని ఒక ప్రశంస వచ్చింది. ఆ వ్యాక్సిన్ దమ్ము ఎంతో చెప్పిన ఆయన ప్రముఖుడికి ఉన్న ఇమేజ్.. ఇప్పుడీ టీకా రేంజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పాలి. కోవాగ్జిన్ టీకాకు 617 కోవిడ్ రకాన్ని నిలువరించే సత్తా ఉందన్న విషయాన్ని గుర్తించినట్లుగా అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు.
కరోనా వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకోవటం.. మ్యుటేషన్ తో మరింత బలోపేతం కావటం తెలిసిందే. ఇటీవల కాలంలో భారత్ లో గుర్తించిన బి.1.617 వైరస్ ను సైతం కోవాగ్జిన్ ధీటుగా ఎదుర్కొగలదన్న విషయాన్ని గుర్తించారు. ఫౌచీతో పాటు.. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయాలజీ డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.
కోవాగ్జిన్ తీసుకున్న వారు కోవిడ్ బారిన పడినా.. వారిలో స్వల్ప లక్షణాలు ఉంటాయే తప్పించి.. తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు తలెత్తే అవకాశం లేదని చెబుతున్నారు. కోవాగ్జిన్ పై ఇంత సానుకూల వ్యాఖ్య.. ఆ టీకా స్థాయిని మరింత పెంచటం ఖాయమని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే.. దేశంలో పెరిగిన కోవిడ్ కేసులపై ఫౌచీ తీవ్రంగా స్పందించారు. ప్రపంచాన్నికమ్మేసిన మహమ్మారిని ఎదుర్కోవటానికి అంతర్జాతీయ స్పందన అవసరమన్నారు.
అసమానతలు లేకుండా సహకరించుకోవాలి. బ్యాడ్ లక్ ఏమంటే.. అది సాధ్యం కాలేదు.. ధనిక దేశాలు తీసుకోవాల్సిన బాధ్యతను తీసుకోలేదన్నారు. కోవిడ్ కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారత్ కు సహకరించటంలో ధనిక దేశాలు ఫెయిల్ అయ్యాయని మండిపడ్డారు. మనం తయారు చేసుకున్న వ్యాక్సిన్ ను ప్రపంచం మొత్తానికి పంచాలన్న మంచి మనసు మనకు ఉండొచ్చేమో కానీ.. మనం కరోనా కోరలకు చిక్కి విలవిలలాడుతుంటే.. ఆదుకోవాలని సాయం పొందిన వారికి అనిపించాల్సిన అవసరం ఏముంది చెప్పండి?