Begin typing your search above and press return to search.
ఆ రెండు నియోజకవర్గాల్లో.. టీడీపీ సంచలనాలు పక్కా...!
By: Tupaki Desk | 20 Aug 2022 12:30 AM GMTఅవును... ఆ రెండు నియోజకవర్గాల్లోనూ.. టీడీపీ సంచనాలు నమోదు చేయడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇతర నియోజకవర్గాలకు భిన్నంగా ఈ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ నాయకులు దూకుడుగా ఉంటున్నారు.
ఎంత బిజీగా ఉన్నా.. నియోజకవర్గంలో వారానికి నాలుగు రోజుల పాటు.. సమయం కేటాయిస్తున్నారు. దీంతో ఇక్కడ పార్టీ జోష్ పెరిగిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అవే.. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తెనాలి నియోజకవర్గాలు.
మంగళగిరిపై పట్టు పెంచుకునేందుకు నారా లోకేష్ తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న లోకేష్ నిత్యం ఎంతో బిజీగా ఉంటున్నారు. వచ్చి పోయే నాయకులు.. పార్టీలో అసంతృప్తులను బుజ్జగించడం.. వంటివి ఆయన చేస్తున్నారు.అయితే.. ఎంత బిజీ గా ఉన్నప్పటికీ.. తన సొంత నియోజకవర్గం.. మంగళగిరిపై నారాలోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ వారానికి నాలుగు లేదా.. మూడు రోజుల పాటు.. ఉంటున్నారు.
ప్రజల సమస్యలను ఓపికగా వింటున్నారు. తాము అధికారంలోకి వచ్చాక.. ఏం చేస్తామో..లోకేష్ వివరిస్తు న్నారు. అదేసమయంలో చిన్న చిన్న సమస్యలకుఅక్కడికక్కడే పరిష్కారం చూపిస్తున్నారు. స్వల్ప మొత్తాల ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తున్నారు. ఇక, ఇటీవలే.. పేదల కోసం మొబైల్ వైద్య శాలను కూడా లోకేష్ ప్రారంభించారు. ఇక్కడ 90 రకాల చికిత్సలు అందించే ఏర్పాటు చేశారు. ఇలా లోకేష్ ఒకవైపు దూకుడు పెంచారు. మరోవైపు.. తెనాలిలోనూ ఇదే పరిస్థితి ఉంది.
తెనాలి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్.. విరామమెరుగకుండా.. తిరుగుతున్నా రు. నిజానికి పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆలపాటి.. మీడియా మీటింగులు నిర్వహిస్తూ.. పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. అదేసమయంలో.. పార్టీ నాయకులతో భేటీ అవుతున్నారు. ఇంత బిజీగా ఉండి కూడా తెనాలిపై తన ముద్ర వేస్తున్నారు. `జన జాగృతి` పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
రోజుకు 100 ఇళ్లను ఆయన సందర్శిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అంతేకాదు.. ఓపికగా వారి సమస్యలు వింటున్నారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ కూడా ఇస్తున్నారు. ఈ పరిణామాలతో అటు మంగళగిరి.. ఇటు తెనాలి నియోజకవర్గాల్లో టీడీపీ దూకుడు పెరిగిందనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.