Begin typing your search above and press return to search.
భార్యపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న ముగ్గురు కొలీగ్స్ ను ఏసేసిన పోలీస్
By: Tupaki Desk | 19 July 2022 5:34 AM GMTఎవరినో ఏదో అంటేనే చాలామంది ఊరుకోరు. నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదని చెబుతుంటారు. అలాంటిది కట్టుకున్న భార్యను ఉద్దేశించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే ఎవరు మాత్రం ఊరుకుంటారు. అలా అని.. వారి ప్రాణాలు తీసే హక్కు కూడా లేదు.
కానీ.. తన భార్యను నోటికి వచ్చినట్లుగా మాటలు అనేస్తూ.. తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ.. ఢిల్లీకి చెందిన పోలీసు ఒకరు తన ముగ్గురు కోలీగ్స్ ను కాల్చి చంపిన వైనం షాకింగ్ గా మారింది. బాధ్యతతో వ్యవహరించాల్సిన పోలీసుల తీరు ఇలా ఉండటమా? అన్న విస్మయానికి గురి చేస్తోంది.
ఇండియన్ రిజర్వు బెటాలియన్ లోని భాగమైన సిక్కిం పోలీసు విభాగానికి చెందిన ముగ్గురు పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలోని హైదర్ పుర్ వాటర్ ప్లాంట్ వద్ద భద్రత విధులు నిర్వర్తిస్తున్నారు.
సోమవరం మధ్యాహ్నం మూడు గంటల వేళలో కాల్పులకు గురైన ముగ్గురు పోలీసులు మరణించినట్లుగా సమాచారం అందింది. దీంతో.. కొంత కలకలం రేగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. కాల్పుల వెనుక ఏం జరిగిందనే అంశంపై ఆరా తీయటం షురూ చేశారు.
ఇదిలా ఉండగా.. తన ముగ్గురు సహోద్యోగుల్ని కాల్చి చంపిన మరో పోలీసు ప్రబీణ్ రాయ్ (32) సమీపంలోని సమయ్ పుర్ బద్దీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
తన భార్య గురించి తన తోటి ఉద్యోగులు అనుచిత వ్యాఖ్యలు చేశారని.. దీంతో తాను ఆవేశం పట్టలేక వారిని కాల్చి చంపినట్లుగా పోలీసుల విచారణలో తెలిపినట్లుగా స్పెషల్ పోలీస్ కమిషనర్ దీపేంద్ర పాఠక్ వెల్లడించారు. ఈ ఉదంతం ఢిల్లీ పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారింది.