Begin typing your search above and press return to search.
సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు..అరెస్ట్.. జైలు
By: Tupaki Desk | 25 Feb 2021 4:07 PM GMTసోషల్ మీడియాలో సీఎం కేసీఆఱ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడు జైలుపాలయ్యాడు. సాధారణంగా ప్రభుత్వాలపై , ప్రభుత్వ అధినేతపై విమర్శలు చేసే వారు చాలా మంది ఉంటారు. ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్ర్య హక్కును దేశంలోని ప్రజలకు రాజ్యాంగం కల్పించింది.
ఓ యువకుడు తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అడ్డంగా దొరికిపోయాడు. యువకుడి వ్యాఖ్యలతో ఆగ్రహం వ్యక్తం చేసిన మరో యువకుడు అతడిపై కేసు పెట్టడంతో చివరకు జైలు శిక్ష పడింది.
2017లో భువనగిరికి చెందిన రామకృష్ణ అనే యువకుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. నవంబర్ 15న జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.సీఎంపై రామకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన పాతబస్తీకి చెందిన ఇబ్రహీం మాదన్నపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ అయ్యింది.
వీడియోలో చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరిపి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు రామకృష్ణకు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. సో రాజకీయ నేతలపై విమర్శలు చేసే వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.