Begin typing your search above and press return to search.
నడిరోడ్డుపై లవర్స్ రచ్చ రంబోలా.. వైరల్ వీడియో..!
By: Tupaki Desk | 18 Jan 2023 8:57 AM GMTమత్తు తలకెక్కితే ఏం చేస్తారో కూడా వారికి తెలియదు. మద్యం.. గంజాయి.. హుక్కా మత్తులో ఆడ.. మగ చేసే విన్యాసాలు తరుచూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటున్నాం. ఇక ప్రేమ అనే మైకం కమ్మితే ఆ నిషా ఎలా ఉంటుందో ప్రేమించిన వారికి తెల్సుంది. ప్రేమ కోసం కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను సైతం లెక్కచేయని కేసులు ప్రతీ పోలీస్ స్టేషన్ లో కోకోల్లలు ఉన్నాయి.
ఇద్దరు మేజర్లు అయితే చట్టప్రకారం వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లి చేయడం తప్ప పోలీసులు కూడా ఇటువంటి కేసుల్లో ఏం చేయలేరు. మరోవైపు ప్రేమికులు చేసే రచ్చతో మాత్రం తల్లిదండ్రుల పరువు గంగలో కలువడం ఖాయం. ప్రేమించడం తప్పు అనేది మా భావన కాదు గానీ తల్లిదండ్రుల పరువు తీసేలా వ్యవహరించడం మాత్రం తప్పే.
అలాగే పిల్లల మనసు తెలుసుకొని తల్లిదండ్రులు సైతం వ్యవహరించినపుడే తల్లిదండ్రులు ప్రేమకు.. పిల్లల ప్రేమకు ఓ సార్థకత ఉంటుంది. కాగా ఇటీవల కొంత ప్రేమ పేరుతో నానా హంగామా చేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ ప్లేసులతో సంబంధం లేకుండా అసభ్యంగా ప్రవర్తిస్తుండటం శోచనీయంగా మారింది.
తాజాగా ఓ ప్రేమజంట బైక్ పై అసభ్యంగా కూర్చొని వెళ్లిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో సైటర్లు వేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో వాహనదారులతో రద్దీగా ఉన్న రోడ్డుపై బైక్ పై ప్రేమ జంట వెళుతోంది. అయితే సాధారణంగా వెళితే ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ వీరిద్దరు బైక్ లో అసభ్యంగా కూర్చొని వెళుతుండటం అందరి కంటపడింది. వీరిద్దరి అలా వెళుతుండగా కొందరు బాటసారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ప్రేమికులిద్దరూ సర్కార్ ఫీట్ ను తలపించేలా బైక్ పై రచ్చ రంబోలా చేశారు. అబ్బాయి బైక్ నడుపుతుండగా అమ్మాయి ముందు నుంచి కూర్చుని అతడిని గట్టిగా కౌగిలించుకుంటుంది. అలా కూర్చున్న యువతి చుట్టూరా జనాలు చూస్తుండగానే తన లవర్ పై ముద్దుల వర్షం కురిపించింది. దీనిని ఒక నెటిజన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది.
ఈ వీడియో కాస్తా పోలీసుల కంట్లో పడటంతో ఈ ప్రేమ జంట కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. లక్నోలోని హజ్రత్ గంజ్వారీ ప్రాంతంలో ఈ వీడియో తీసినట్లు పోలీసులు గుర్తించారు. నడిరోడ్డుపై అసభ్యంగా వ్యవహరించిన ప్రేమికులపై పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. కాగా ఇటువంటి ఘటనే ఇటీవల విశాఖపట్టణంలోని వెలుగు చూడటం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.