Begin typing your search above and press return to search.
ఇలాంటి వారిని నమ్మేదెలా.. వైసీపీలో గుసగుస
By: Tupaki Desk | 27 Dec 2021 10:45 AM GMTతాజాగా విజయవాడ లో జరిగిన ఘటనలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. పార్టీలో ఉన్న కొందరు నేతలు చేస్తున్న పనులతో పార్టీకి ఇబ్బంది తప్పదని అంటున్నారు. ``ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు. మా పార్టీ నాయకుడిని తిట్టి పోసి.. ప్రత్యర్థి పార్టీ అధినేత విజయం కోసం పని చేసిన.. ఒక నేత దగ్గరకు మా వాళ్లు ఎందుకు వెళ్తున్నారో అర్ధం కావడం లేదు`` అని విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు, అగ్ర వర్ణానికి చెందిన మాజీ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. ఇది కొన్ని గంటల్లోనే జరగడం మరింత విశేషం.
అయితే.. వైసీపీలో ఇది కొత్త కాదని పలువురు నాయకులు అంటున్నారు. ``మా నాయకులకు.. అన్ని పార్టీల నేతలతో నూ సంబంధాలు ఉన్నాయి. ఇతర పార్టీల నేతలతో కలిసినంత మాత్రాన వచ్చే ఇబ్బంది లేదు`` అని కొందరు అంటున్నారు.
కానీ, క్షేత్రస్థాయి లో మాత్రం కేడర్ దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో విజయవాడకు చెందిన ఒక నాయకుడు.. తనకు సీటు ఇవ్వలేదని.. అలిగి.. వేరే పార్టీలోకి జంప్ చేశారు. ఆయన పార్టీ మారినందుకు ఎవరికీ ఇబ్బంది లేదు. పైగా ఇది సహజ ప్రక్రియే.
కానీ, పొరుగు పార్టీలో చేరి.. అప్పటి వరకు అండగా ఉన్న పార్టీ అధినేతను ఓడించేందుకు యజ్ఞాలు యాగాలు చేయడ మే అప్పట్లోను.. ఇప్పుడుకూడా చర్చనీయాంశంగా మారింది. పైగా అమరావతి రాజదానికి బాహాటం గానే మద్దతు ప్రకటించారు. ఇక, వైసీపీ కి వ్యతిరేకంగా ధర్నాలు, దీక్షలు చేశారు. మరి అలాంటి నాయకుడితో తగుదునమ్మా.. అంటూ.. వైసీపీలో ఉన్న వారు చట్టాపట్టాలేసుకుని తిరగొచ్చా? అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న ప్రశ్న.
అంతే కాదు.. ఆయన ఇంట్లో కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఆయన గతంలో తిట్టిన తిట్లను.. జగన్‌ను అన్న మాటలను కూడా పక్కన పెట్టి.. ఆయనను దువ్వుతున్నారు. మరి ఇలాంటి వారిని నమ్మేదలా? పదవులే ప్రామాణికంగా.. జంపింగులు చేసే ఇలాంటి నాయకుల వల్ల.. పార్టీకి ఒరింగింది ఏంటి? అని కూడా నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే విషయం వైసీపీలోనూ అంతర్గతంగా బాగానే చర్చ సాగుతోంది.
కొందరు నాయకులు ఈ విషయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. మరి కొందరు మాత్రం.. ఎవరు ఏం చేస్తున్నారో.. జగన్‌కు అన్నీ తెలుసునని.. సమయం వచ్చినప్పుడు.. తప్పకుండా చర్యలు తీసుకుంటార ని.. ఎవరినో బతిమాలి.. బామాలి.. పార్టీలోకి తీసుకురావాల్సిన అవసరం లేదని.. కూడా వారు చెబుతున్నారు. మొత్తానికి తాజా ఎపిసోడ్ తీవ్ర వివాదంగా అయితే.. మారింది.