Begin typing your search above and press return to search.
బెంగళూరు పాడుపనిని వెనకేసుకొచ్చిన మంత్రి
By: Tupaki Desk | 2 Jan 2017 4:56 PM GMTదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు కీచకుల ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. రోడ్ల మీద అమ్మాయిల్ని ఇష్టారాజ్యంగా వ్యవహరించటమే కాదు.. కనిపించిన అమ్మాయిని కనిపించినట్లుగా.. ఇష్టారాజ్యంగా పట్టేసుకోవటం.. తాకరాని చోట దుర్మార్గంగా తాకిన వైనంపై ఇప్పటికే తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న వేళ.. ఈ ఉదంతంపై కర్ణాటక రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలవటమే కాదు.. కర్ణాటక ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టినట్లుగా చెప్పక తప్పదు.
డిసెంబరు 31వ తేదీ రాత్రి వేళలో.. న్యూఇయర్ సంబరాల కోసం పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చిన మహిళల్ని.. కొందరు ఆకతాయి మూకలు ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. ఈ ఉదంతంపై ఒక జాతీయ మీడియా సంస్థకు చెందిన ఫోటో గ్రాఫర్ తీసిన ఫోటోలు సాక్ష్యాలుగా నిలవటం.. ఈ కథనం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే.. ఈ ఉదంతానికి కారణమైన దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి.. అందుకు భిన్నంగా మహిళలపై నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది. యువత అనుసరిస్తున్న ప్రాశ్చాత్య ధోరణి వల్లే బెంగళూరు అనర్థం జరిగిందని వ్యాఖ్యానించారు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి.. పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ చాలా సింఫుల్ గా తేల్చేయటంపై పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు.
దురదృష్టం కొద్దీ న్యూఇయర్ లాంటి వేడుకల సమయంలోనే ఇలాంటివి జరుగుతుంటాయని.. ఆ రోజు మొత్తం యువత అక్కడే ఉన్నారని.. వారంతా ప్రాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తున్న వారేనన్నారు. ‘‘వారి ఆలోచనలో కాదు. వారి డ్రెస్సింగ్ స్టైల్ కూడా ప్రాశ్చాత్య సంస్కృతి మాదిరే ఉంది. అందుకే కొంత గందరగోళం జరిగింది. కొంతమంది అమ్మాయిలు వేధింపులకు గురయ్యారు’’ అంటూ నిర్లక్ష్యపూరితంగా వ్యాఖ్యానించటంపైపలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి స్పందించిన తీరుపై పలువురు నిలదీయటమే కాదు.. ఆయన బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/